ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసులు మంగళవారం జడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసులు మంగళవారం జడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేశారు. సాయుధులైన 36 మంది కమాండోలను ఆయన రక్షణ కోసం కేటాయించనున్నారు. ఆయన ఇంటి వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సాయుధులైన గార్డులను నియమిస్తారు.
ఒక పైలట్ వాహనంతో పాటు రెండు ఎస్కార్ట్ వాహనాలను ఆయన వాహన శ్రేణికి జత చేస్తారు. ఇంతకుముందు సీఎంగా చేసినప్పుడు కేజ్రీవాల్ భద్రతను నిరాకరించడం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు సుమోటోగా ఆయనకు భద్రతా ఏర్పాట్లు చేశారు.