
సునీత సహకారంతోనే.. కేజ్రీవాల్
తన భార్య సునీత కేజ్రీవాల్ సహకారం లేకుంటే ఏమీ సాధించేవాడిని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ : తన భార్య సునీత కేజ్రీవాల్ సహకారం లేకుంటే ఏమీ సాధించేవాడిని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హస్తినలో ఘన విజయం అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన భార్య సునీతను ఆప్ కార్యకర్తలకు పరిచయం చేశారు.
ఢిల్లీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఉన్నికల్లో విజయం ఆప్ కార్యకర్తలతో పాటు ఢిల్లీ ప్రజలదిగా ఆయన అభివర్ణించారు.