ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు ఘోర పరాభవం ఎదురైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు ఘోర పరాభవం ఎదురైంది. ఏడు వామపక్ష పార్టీలు లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ఏకమై 15 స్థానాల్లో పోటీకి దిగగా కనీసం ఒక్క స్థానంలోైనె నా డిపాజిట్ దక్కలేదు. ఏ ఒక్క అభ్యర్థికీ కనీసం వెయ్యి ఓట్లు లభించలేదు. ఎస్‌యూసీఐ-సీ తరుపున బాద్లీ నుంచి పోటీ చేసిన రాకేశ్ కుమార్‌కు గరిష్టంగా 947 ఓట్లు పడ్డాయి.
నాలుగు చోట్ల మినహా మిగతా స్థానాల్లో లెఫ్ట్ అభ్యర్థులకు కనీసం 500 ఓట్లు కూడా రాలేదు. కాంగ్రెస్, బీజేపీలను అధికారానికి దూరంగా ఉంచాలన్న ఆలోచనతో లెఫ్ట్ పార్టీలు తాము పోటీచేయని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటెయ్యాలని తమ మద్దతు దారుల్ని కోరాయి.