మీడియాకు మొహం చాటేసిన రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం వీఐపీ పోలింగ్ బూత్ నిర్మాణ్ భవన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హస్తిన కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా..ఆయనను దగ్గరుండి పోలింగ్ బూత్ వైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ను మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన ఏమాత్రం స్పందించలేదు.
చివరికి మీడియాతో మాట్లాడకుండానే రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇదే పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఓటు వేశారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నారు.