Vice President Rahul Gandhi
-
'నా చెల్లి రాజకీయాల్లోకి వస్తే చూడాలని ఉంది'
హమీర్పూర్: ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోని చాలామంది సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తుండగా... తొలిసారి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అదే రకమైన అభిప్రాయం చెప్పాడు. తన సోదరి ప్రియాంక గాంధీ రాజకీయ ఆరంగేట్రం గురించి రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరి పూర్తి రాజకీయాల్లో పాల్గొంటే తనకూ చూడాలని ఎప్పటి నుంచి ఉందని అన్నారు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడితే తనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. అయితే, నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిందే ప్రియాంకేనని అన్నారు. తాను అందరికన్నా తన సోదరి ప్రియాంకనే ఎక్కువగా నమ్ముతానని, ఇష్టపడతానని రాహుల్ చెప్పారు. మరోపక్క, ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆరెస్సెస్ పై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆరెస్సెస్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని, ఎందుకంటే ఆయన అందులో శిక్షణ పొందిన వ్యక్తని విమర్శించారు. ఆరెస్సెస్, బీజేపీ ఎప్పుడూ మతతత్వ రాజకీయాలను పెంచిపోషిస్తాయని, అలా చేయడమంటే హింసను సృష్టించడమే తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఏ పార్టీతోనూ యూపీలో పొత్తు పెట్టుకోమని చెప్పిన ఆయన ఈసారి యూపీలో అధికారం చేతులు మారబోతుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడుతున్నారని చెప్పారు. -
యుగపురుషుడు, అర్జునుడు రాహులేనట!
అలహాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అర్జునావతారంలో దర్శనమిచ్చారు. అది కూడా ఓ ఫ్లెక్సీలో.. మరో మూడు రోజుల్లో అహ్మదాబాద్‌లో రాహుల్ గాంధీ మహా రోడ్ షో ఉన్న నేపథ్యంలో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఇలాంటి ఫ్లెక్సీలు కాస్తంత వివాదానికి దారి తీశాయి. రాహుల్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల్లో నాయకులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. రాహుల్ ను మహాభారతంలోని అర్జునుడి అవతారంతో పోలుస్తూ యుగపురుషుడిగా అభివర్ణిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అందులో రాహుల్ ను భాణం ఎక్కుపెట్టిన అర్జునుడిగా చిత్రిస్తూ దానిని జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో పెట్టారు. దీనిపై పలుచోట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. కిసాన్ యాత్రలో భాగంగా గురువారం అలహాబాద్ లో ప్రచారం చేసేందుకు రాహుల్ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలో ఒక్క ఆయనది మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ, ఉత్తప్రదేవ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రాజ్ బబ్బార్, రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతల ఫొటోలు ఉన్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పోస్టర్ల గురించి అక్కడి కాంగ్రెస్ నేతలకే తెలియదంట. దీనిపై స్పందించేందుకు కూడా వారు నిరాకరించారు. ఓ సీనియర్ నేత మాత్రం దీనిపై స్పందిస్తూ తాము రాహుల్ రోడ్ షో గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నామని, ప్రస్తుతానికి అలాంటి పోస్టర్ల గురించి చర్చించి విలువైన సమయాన్ని వృధా చేసుకోబోమంటూ వ్యాఖ్యానించారు. -
మీడియాకు మొహం చాటేసిన రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం వీఐపీ పోలింగ్ బూత్ నిర్మాణ్ భవన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హస్తిన కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా..ఆయనను దగ్గరుండి పోలింగ్ బూత్ వైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌ను మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన ఏమాత్రం స్పందించలేదు. చివరికి మీడియాతో మాట్లాడకుండానే రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇదే పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఓటు వేశారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నారు. -
కుష్భుకు అందలం
* జయంతి ఎక్కడ * ఈవీకేఎస్ వ్యూహం ఫలించేనా? సాక్షి, చెన్నై: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భును అందలం ఎక్కిం చేందుకు ఏఐసీసీ కసరత్తుల్లో పడింది. ఆమెకు అధికార ప్రతినిధి లేదా, పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినీ గ్లామర్ ద్వారా పార్టీ బలోపేతం లక్ష్యంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ రచిస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయోనన్న చర్చ ఆరంభం అయింది. చక్కటి వాక్ చాతుర్యం, అనర్గళంగా పలు భాషల్ని మాట్లాడగలిగిన కుష్భు డీఎంకేలో రాణించినా, అక్కడి రాజకీయాలకు తట్టుకోలేని పరిస్థితి. ఎట్టకేలకు అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తానేమీ ఆషామాషీ నాయకురాలు కాదన్నట్టుగా ఆమె ప్రవేశం ఢిల్లీ పెద్దల సమక్షంలో జరగడం ఇక్కడి కాంగ్రెస్ వాదులను విస్మయంలో పడేసింది. టెన్ జన్‌పథ్ ఆశీర్వాదం, ఆహ్వానం కోసం ఇక్కడి నేతలు నెలల తరబడి ఎదురు చూడటం సహజం. అయితే, పార్టీలోకి వచ్చీరాగానే, టెన్ జన్‌పథ్ మెట్లు ఎక్కడం అధినేత్రి సోనియా గాంధీతో ముచ్చటించడం, వెను వెంటనే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకోవడం, జాతీయ స్థాయి నాయకులు ఆమె ప్రెస్ మీట్లో కూర్చోవడం వంటి పరిణామాల్ని చూసిన ఇక్కడి కాంగ్రెస్‌వాదులు, కుష్భు రాష్ర్ట పార్టీలో అధినాయకురాలు అయినట్టున్నారేనని పెదవి విప్పుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగానే కుష్భుకు మంచి గుర్తింపు ఇవ్వడానికి ఏఐసీసీ నిర్ణయించింది. జయంతి ఎక్కడ: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పరి ణామాలు చోటు చేసుకుంటుంటే, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఏమయ్యారోనన్న ప్రశ్న బయలు దేరింది. ఆమెకు చెక్ పెట్టడం లక్ష్యం గానే కుష్భును తెర మీదకు ఈవీకేఎస్ తీసుకొచ్చినట్టుగా ప్రచారం మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, కేవలం ఢిల్లీ పరిచయాలతో పదవులను దక్కించుకుంటున్న ఆమెను పక్కన పెట్టేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం సిద్ధమయ్యారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవీకేఎస్ వ్యూహాలు ఫలించేనా : కుష్భుకు బలమైన పదవి అప్పగించడం ద్వారా ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఉపయోగించుకునేందుకు నిర్ణయించిన ఏఐసీసీ అధిష్టానం, ఇక నటుడు కార్తీక్‌ను త్వరితగతిన పార్టీలోకి తీసుకొచ్చే విధంగా ఆదేశాలను ఇచ్చింది. వీరితో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా అవసరం అయితే, ఎన్నికల వేళ కుష్భును అందలం ఎక్కించి మహిళా ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ఈవీకేఎస్ వ్యూహ రచనలు చేసి ఉన్నట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్ వర్గం బయటకు వెళ్లింది. ఇక చిదంబరం, తంగబాలు, ఆర్ ప్రభు తదితర గ్రూపుల్ని కుష్భు ఏ మేరకు అధిగమించి రాష్ట్ర కాంగ్రెస్‌లో రాణిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.