ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పటిష్ట భద్రత నడుమ ఢిల్లీలోని 14 కేంద్రాల్లో లెక్కింపు మంగళవారం
న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పటిష్ట భద్రత నడుమ ఢిల్లీలోని 14 కేంద్రాల్లో లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 70 స్థానాల తుది ఫలితాలు విడుదల కానున్నాయి.
కాగా ఢిల్లీ పీఠం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్),భాజపాల మధ్య హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల పోరులో ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో మరికొన్ని గంటల్లో సృష్టం కానుంది. రికార్డు స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ శాతం నమోదైన ఈ ఎన్నికల్లో మొత్తం 673 మంది అభ్యర్థులు తమ భవితవ్యం కోసం వేచి చూస్తున్నారు.