ఢిల్లీలోని పటేల్ నగర్‌లో ఉన్న 'ఆప్' కార్యాలయం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని పటేల్ నగర్‌లో ఉన్న 'ఆప్' కార్యాలయం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఆప్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఆప్ కార్యాలయం దగ్గర 'జనతా కా సీఎం' కేజ్రీవాల్ అని రాసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆప్ 28 స్థానాల్లో ముందంజలో ఉండి గెలుపు దిశగా వెళుతోంది. గ్రేటర్ కైలాస్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట వెనుకంజలో ఉన్నారు. ఆమెపై బీఎస్పీ అభ్యర్థి ఆదిత్య ముందంజలో ఉన్నారు.