
ఎన్నికల భగ్నానికి కుట్ర
ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న తొమ్మిదిమందితో కూడిన ముఠాను గురువారం పోలీసులు అరెస్టు
తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న తొమ్మిదిమందితో కూడిన ముఠాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 తుపాకీలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు... ముండ్కా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రీతా షోకీన్‌కు బంధువైన నీర జ్ బవానాను, అతని గ్యాంగ్ ఎనిమిది మందిని ఔటర్ ఢిల్లీలోని బవానా ప్రాంతంలో గురువారం అరెస్టు చేశారు.
‘ మాకు అందిన సమాచారం మేరకు నీరజ్ గ్యాంగ్ ముండ్కా ప్రాంతంలో తరచూ దందాలకు పాల్పడుతున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఓటర్లను భయపెట్టి, తమకు అనుకూలమైన అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రలోభపెడుతున్నారు.’ అని డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజీవ్ కుమార్ యాదవ్ తెలిపారు.