న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఉదయం ఓటర్లను ఓ విషయాన్ని సూచించారు. 'ప్రతి ఒక్కరూ స్నానం చేసి, దేవుణ్ని ప్రార్థించి ఆ తర్వాత మీ ఓటును నమోదు చేసుకోవాలని, కొత్త బట్టలు ధరించి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటువేస్తే, మీరు కోరుకున్నది జరుగుతుంది' అని ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
పెద్ద ఎత్తున తరలిరావాలి: ప్రధాని
తమ అభిమాన నేతలకు ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. 'పెద్ద ఎత్తున ఓటేయడానికి బయటకు రండి. యువ ఓటర్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను' అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లలో పేర్కొన్నారు.