కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో మంగళవారం పాదయాత్ర జరుగుతుండగా.. భద్రతా వలయాన్ని చేధిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీని దాటుకొని వచ్చిన ఎల్లో జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. రాహుల్ పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్‌కు జెడ్-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే. అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న సీఆర్‌పీఎఫ్ సరైన భద్రత కల్పించడంలో విఫలమవుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది.
చదవండి: మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే
కాగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని తండాలో మంగళవారం ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌తోఆటు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో యాత్రలో పాల్గొన్నారు.
Security breach under the AAP govt. This is how AAP is providing security to Rahul Gandhi Ji. pic.twitter.com/kyTV6fMHxr
— Shantanu (@shaandelhite) January 17, 2023
Comments
Please login to add a commentAdd a comment