Rahul Gnadhi
-
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్
న్యూఢిల్లీ: వీలు దొరికినపుడల్లా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని హిమంత ఈసారి ఏకంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌తో పోల్చారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ బాబా సిద్ధికీ రాహుల్ గాంధీ టీమ్‌పై చేసిన బాడీ షేమింగ్ ఆరోపణలపై హిమంత స్పందించారు. నార్త్ కొరియా నియంత కిమ్ ఒక్కడే తనతో ఫొటో దిగే పార్టీ కార్యకర్తలు ఫొటోజెనిక్‌గా ఉండాలని కోరుకుంటారని హిమంత రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కలవాలని వెళ్లిన తనను 10 కేజీల వెయిట్ తగ్గి రావాల్సిందిగా రాహుల్ టీమ్ సభ్యులు సూచించారని బాబా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు సంచనం రేపాయి. కాగా, గత నెలలో అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన సమయంలో హిమంత ప్రభుత్వం రాష్ట్రంలో యాత్రకు చాలా షరతులు విధించింది. గువహతిలోకి యాత్ర ప్రవేశించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి రాహుల్‌గాంధీపై అస్సాం సీఐడీ కేసు కూడా పెట్టింది. త్వరలో ఈ కేసులో సీఐడీ రాహుల్‌కు సమన్లు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. The only other person, I can think of, who makes such ridiculous demands from his party workers – that they should look nice and photogenic – is a dynast who rules North Korea. https://t.co/sAlcMoOwPQ — Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024 ఇదీ చదవండి.. రాహుల్‌ను కలవాలంటే 10 కేజీలు తగ్గమన్నారు -
మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ భారత జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బిహార్‌లో సాగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ వైదోలిగన మరుసటి రోజే(సోమవారం) కిషన్‌గంజ్ నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూర్నియాలో రాహుల్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగింస్తూ.. తొలిసారి నితీష్ కుమార్ ఎన్డీయే గూటికి చేరడంపై స్పందించారు. బిహార్‌లో సామాజిక న్యాయం అందించే బాధ్యత ఇండియా కూటమి తీసుకుందని.. ఇకపై బిహార్‌కు నితీష్ అవసరం లేదని అన్నారు. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కకున్నారని మండిపడ్డారు. మహాఘట్ బంధన్ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తామని చెప్పారు. మోదీ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు రాహుల్. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి కులగణన ఎంతో అవసరమన్న ఆయన భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ.. ఎవరీయన? ఇదిలా ఉండగా క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తుకు హాజరైన నేపథ్యంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ సహా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేతలు నేడు పూర్నియాలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ర్యాలీకి దూరంగా ఉన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం బీహార్‌లోని పూర్నియాలో రైతు సంఘం సభ్యులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓ ధాబాలో టీ తాగుతూ కొంతమంది బీహార్ నివాసితులతో మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ కూడా ఉన్నారు. आज एक ढाबे पर कुछ बिहार निवासियों से चाय के दौरान कई बातें हुईं।#BharatJodoNyayYatra pic.twitter.com/Nsug8YrW2Q — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) January 30, 2024 आज पूर्णिया में भारत जोड़ो न्याय यात्रा के दौरान @RahulGandhi ने स्थानीय किसानों के साथ काफ़ी देर तक बातचीत की। किसानों ने उन्हें अपने साथ हो रहे अन्याय से अवगत कराया। उन लोगों ने बताया कि वे बढ़ती इनपुट लागत, भूमि अधिग्रहण की ग़लत नीति और फसलों के लिए पर्याप्त MSP न मिलने से… pic.twitter.com/ptlK7ruBZZ — Jairam Ramesh (@Jairam_Ramesh) January 30, 2024 -
అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరనుంది. సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్‌తోపాటు పలు కీలక పార్టీల అధినేతలకు కూడా శ్రీ రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని వెల్లడించిన విషయం విదితమే. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధానితో సహా బీజేపీ నేతృత్వంలోని కీలక నేతలు జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొంటే.. ఆ రోజు కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు, ఇతర పార్టీ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శన.. మతం అనేది వ్యక్తి గతమైన విశ్వాసమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆమె జనవరి 22న కోల్‌కతా సమీపంలోని కాళీఘాటకు వెళ్లి కాళీమాతను దర్శింకుంటానని తెలిపారు. అదేవిధంగా మత సామరస్యం పెంపొందాలని ర్యాలి చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాహుల్‌గాంధీ అస్సాంలో టెంపుల్ దర్శనం? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయం యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక యాత్రలో భాగంగా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు జనవరి 22న అస్సాంలోని ఓ గుడిని సందర్శిస్తారని తెలుస్తోంది. ఆ రోజు కాకుండా మరో రోజు.. రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదటి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాను రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేనని వెల్లడించారు. రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తాను అయోధ్య రాముడిని చాలా సులువుగా దర్శించుకుంటానని తెలిపారు. అప్పటి వరకు రాముడి మందిరం పూర్తిగా నిర్మాణం అవుతుందన్నారు. ఇంకా ఆహ్వానం అందలేదు.. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రస్తుతానికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందకపోవటం గమనార్హం. కానీ, ఆయన ఇప్పటికే రామ భక్తిలో నిండిపోయారు. జనవరి 22 రోజును ఢిల్లీ వ్యాప్తంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఆదేశించారు. సుందరకాండ పఠన కార్యక్రమాలను ఏర్పాటు చేయటంలో ఆప్ ప్రభుత్వం నిమగ్నమైంది. దేశ ప్రజలు కోరుకున్నవి జరగాలని అయోధ్య బాలరాముడికి ప్రార్థన చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే.. ‘మహా హారతి’ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జనవరి 22న నాసిక్‌లోని కాలారామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భగవాన్ కాలారామ్కు ‘మహా హారతి’ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆలయంలో నల్లరాతితో ఉన్న విగ్రహంలో రాముడు దర్శనం ఇస్తారు. రాముడు వనవాస సమయంలో నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో సీతా, లక్ష్మణులతో ఉండేవారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ జనవరి 22న జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళనాడులో డీఎంకే పార్టీ.. ఆధ్యాత్మికత పేరుతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్.. గత నెలలోనే తాము అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరుకామని తెలిపారు. తాము మతాలకు సంబంధించిన విశ్వాసాలు గౌరవిస్తామని అన్నారు. అయితే రాజకీయ ముగుసులో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలపై నమ్మకం లేదన్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ కౌంటర్ బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజే పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌ను ప్రారంభించాడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసాలను బలోపేతం చేయటమే కాకుండా ఒడిశాలో బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో సహా ఇండియా కుటమి నేతలు.. బీజేపీ రామ మందిరాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా వాడుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని మండిపడుతున్నారు. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హజరుకాకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం అయోధ్య ముఖం చూడనన్న ప్రధాని మోదీ! -
జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో మంగళవారం పాదయాత్ర జరుగుతుండగా.. భద్రతా వలయాన్ని చేధిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీని దాటుకొని వచ్చిన ఎల్లో జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. రాహుల్ పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్‌కు జెడ్-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే. అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న సీఆర్పీఎఫ్ సరైన భద్రత కల్పించడంలో విఫలమవుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. చదవండి: మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే కాగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని తండాలో మంగళవారం ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్తోఆటు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో యాత్రలో పాల్గొన్నారు. Security breach under the AAP govt. This is how AAP is providing security to Rahul Gandhi Ji. pic.twitter.com/kyTV6fMHxr — Shantanu (@shaandelhite) January 17, 2023 -
రాహుల్ రాజకీయ సలహాదారు ఎవరో ఊహించండి!
రాహుల్‌గాంధీ రాజకీయ సలహాదారు ఎవరై ఉంటారో ఒక్కసారి ఊహించండి. 2005లో మన్మోహన్ సింగ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) సందర్శించినప్పుడు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించిన యువ కామ్రేడ్ సందీప్ సింగే నేటి రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలకు రాజకీయ సలహాదారుగా మారాడు. అయితే ఇది అధికారికంగా ప్రకటించనప్పటికీ రాహుల్, ప్రియాంకకు ఈయనే సలహాదారుగా ఉన్నారు. రాహుల్, ప్రియాంకల ప్రతి మాటలోనూ, ప్రతి నడవడికలోనూ సందీప్ మార్కు స్పష్టమవుతూనే ఉంది. అంతదాకా ఎందుకు.. రాహుల్ సభల్లో మాట్లాడే ప్రతి పలుకూ సందీప్దేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వామపక్ష భావజాలం నుంచి వచ్చి, భారత రాజకీయాలపైనా, భాషపైనా పట్టున్న సందీప్ సింగ్ ఇప్పుడు రాహుల్‌గాంధీకి ఉపన్యాసాలు రాసిపెడతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకా వాద్రాని గైడ్ చేయడం కోసం రాహుల్‌గాంధీ సందీప్ సింగ్‌ని ఎంచుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీకి సింగ్ ఎప్పుడు, ఎక్కడ పరిచయం అన్నది తెలియదు కానీ హఠాత్తుగా 2017 నుంచీ రాహుల్ గాంధీ దగ్గర సందీప్ ప్రత్యక్షమయ్యాడన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం. నాడు రైవల్.. నేడు అడ్వయిజర్ ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో సందీప్‌సింగ్ జన్మించారు. అలహాబాద్ వర్సిటీలో డిగ్రీ చేసి, జేఎన్‌యూలో కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్ట్) లిబరేషన్ అనుబంధ సంస్థ, జేఎన్‌యూలో ప్రభావవంతంగా పనిచేస్తోన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారు. 2007లో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జేఎన్‌యూ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ పాలిటిక్స్ నుంచి సైతం వైదొలిగి, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో లోక్‌పాల్ బిల్లుకోసం సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. జేఎన్‌యూలో ఎన్ఎస్యూఐకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సలహాదారుడిగా ఉండడాన్ని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రియాంక గంగా యాత్ర సందర్భంగా సావిత్రీబాయి ఫూలే అనే దళిత నాయకురాలిని వెంటబెట్టుకుని ప్రియాంక యాత్ర కొనసాగించడం గానీ, దళిత హక్కుల యువ నేత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ని కాంగ్రెస్ నేతలు కలవడం గానీ సందీప్ సింగ్ సలహా కారణంగానే జరిగాయని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులు అంటున్నారు. -
ఆపత్కాలంలో ‘అనివార్యత’ ముసుగు
బలమైన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నించే నేరబుద్ధి చంద్రబాబుకు ముందునుంచీ ఉందని వంగవీటి రంగా హత్యోదంతం తేల్చి చెప్పింది. అలాగే వైఎస్ జగన్‌ని హత్య చెయ్యడానికి జరిపిన కుట్ర.. కాస్తలో విఫలమైందని జనం గట్టిగా నమ్మడంతో దిక్కుతోచక ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో కాంగ్రెస్‌తో దోస్తీ ప్రహసనాన్ని అడ్వాన్స్ చేశారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నిటినీ కూడగడతానని బయలుదేరిన బాబును ఈ జాతీయ పార్టీలన్నీ నిలదీసి, ముందు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వంసాన్ని ఆపి, వాటిని స్వతంత్రంగా పనిచేయనిచ్చి అప్పుడు జాతీయ స్థాయిలో ప్రక్షాళనకు రమ్మని ఎందుకు అడగవు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఒక కొత్త పదం దొరికింది. అది ‘‘ప్రజాస్వామ్య అనివార్యత’’ (democratic compulsion. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్‌తో జత కట్టడానికి బాబు ఎన్నుకున్న పదం ఈ ప్రజాస్వామ్య అనివార్యత. ఈ అనివార్యత ఏమై ఉంటుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. దానితోపాటు ఇంకో మాట చెప్పాడాయన. వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నారు, వాటిని కాపాడటమే ఆ ప్రజాస్వామ్య అనివార్యత అని. ఈ గొప్ప లక్ష్య సాధన కోసమే గతాన్ని మరిచి పోయి కాంగ్రెస్‌తో చెలిమికి సిద్ధపడ్డామని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు ఏ ప్రజాస్వామ్య అని వార్యతలో భాగంగా ఏయే వ్యవస్థలను రక్షించడానికి నడుము కట్టారో, అసలు ఆ వ్యవస్థలను సమూలంగా నాశనం చెయ్యబూనుకున్నది ఎవరో దేశానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆయన చెప్పిందేమిటి ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ వంటి వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ద్వారా వాటిని ధ్వంసం చేస్తున్నదని కదా. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, మామ పంచన జీవి స్తున్నా ఈ వ్యవస్థలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అనడానికి బోలెడు నిదర్శనాలు ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. ఆదినుంచీ అవకాశవాదమే... కాంగ్రెస్‌తో చంద్రబాబు బహిరంగంగా కలవాల్సిన అనివార్యత గురించి చెప్పుకుని అప్పుడు ఆ విషయాల్లోకి వెళ్దాం. బహిరంగంగా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన కాంగ్రెస్‌లో పుట్టి రాజకీయ అవకాశవాదంతో మామ పంచన చేరిన దగ్గరి నుంచీ కాంగ్రెస్‌తో రహస్య స్నేహం కొనసాగిస్తూనే ఉన్నాడు. పాపం రాజకీయ ఎత్తుగడలు తెలియని ఎన్టీరామారావు ఇది గమనించలేదు. 1995లో మామగారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడు ఆ అధికారాన్ని నిలబెట్టుకోడానికి అప్పటి కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం శరణు జొచ్చాడు. ఎన్టీరామారావు చేసిన విజ్ఞప్తిని ఆనాడు పీవీ నరసింహారావు పట్టించుకుని ఉంటే, ఇవాళ చంద్రబాబు రాజకీయాల్లో ఉండేవాడు కాదు. ఆ తరువాత కొద్ది మాసాలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల తరువాత చంద్రబాబు చక్రం తిప్పిన యునైటెడ్ ఫ్రంట్ కాకుండా ఎన్టీఆర్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి ఆయన ప్రధాన మంత్రి కూడా అయ్యేవారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కంటే తక్కువ స్థాయి నాయకుడేమీ కాదు ఎన్టీఆర్. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే ప్రధాని అయి చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలు తప్పేవి కాదు. తాను చక్రం తిప్పానని చెపుతున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నడపడానికి కూడా కాంగ్రెస్ మద్దతు తీసుకోడానికి చంద్రబాబు వెనకాడలేదు. ఇక కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న తాను కేసుల నుంచి తప్పించుకోడానికి చక్కగా వీలుంటుంది. గతంలో చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ మంత్రి చిదంబరాన్ని కలసిన విషయం ఆ మంత్రే చెప్పారు, చంద్రబాబు దాన్ని ఖండించలేదు. యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి అసెంబ్లీలో అవిశ్వాసం సందర్భంగా వోటింగ్ నుంచి చంద్రబాబు గైర్హాజర్ కావడం కూడా చూశాం. ఆ తరువాత అదే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయి ‘‘వ్యవస్థలను వాడుకుని‘‘ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు బెయిల్ కూడా రాకుండా చూసిన ఘనత చంద్రబాబుదే. ఇవీ ఆయన ప్రజాస్వామ్య అనివార్యతలు. వెంటాడుతున్న ఓటుకు కోట్లు కేసు కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి స్నేహాన్ని, ఇప్పుడు వెలుగులోకి తెచ్చేసిన కొత్త ప్రజాస్వామ్య అనివార్యత ఏమిటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వోటుకు కోట్లు కేసులో శిక్ష అనుభవించక తప్పని ‘‘అనివార్యత’’ చంద్రబాబును కాంగ్రెస్ పంచన చేర్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసు నీరు గార్చేయ్యవచ్చునన్న ధీమా ఆయనది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని నిధులయినా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఛీ కొడితే కాంగ్రెస్‌తో అక్కడ ఎట్లా కలిసి వెళతారు అనే సందేహం ఎవరికయినా సహజంగానే వస్తుంది. అది కూడా ఒక అనివార్యతే. ఆ అనివార్యత పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకత్వంలోని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీజీపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నాడు పొలిట్ బ్యూరోతో సంప్రతిం పులు, సీనియర్ నాయకులతో చర్చలు అని ప్రదర్శిం చిన నాటకానికి కూడా తావులేకుండా ఇప్పుడు చటుక్కున ప్రత్యేక విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించడం వెనక ఉన్న తక్షణ అనివార్యత జగన్ మోహన్‌రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి. ఈ దాడి జరిగిన కొద్ది సేపట్లోనే రాష్ట్ర డీజీపీ ఆయన వెనకే బాబు మీడియా గోష్టి ఏర్పాటు చేసి, జగన్ అభిమానే దాడి చేశాడనీ, జగన్‌కు సానుభూతి పెరగడానికే ఈ దాడి చేయించుకున్నారనీ స్థాయి మరిచి దిగజారుడు ప్రకటనలు చేసి నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు. నిజమే, జగన్ మీద జరిగిన దాడికి చంద్రబాబునాయుడు ఇదే రంగు పూయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తాను చేసినట్టే అందరూ చేస్తారని నమ్మించజూస్తారు ఆయన. ప్రత్యర్థుల నిర్మూలన అలవాటే ఒక్కసారి మల్లెల బాబ్జీని జ్ఞాపకం చేసుకుందాం. 34 ఏళ్ళ కిందట ఎన్టీ రామారావు మీద బాబ్జీ అనే యువకుడితో దాడి చేయించి తద్వారా సానుభూతి పొందడానికి స్కెచ్ వేసింది చంద్రబాబేనని తర్వాతికాలంలో మల్లెల బాబ్జీ ఆత్మహత్య తరువాత బయటపడింది. ఆ విషయం ఇండియాటుడే వంటి ప్రతిష్టాత్మక జాతీయ ఆంగ్ల వారపత్రిక రాసిన విషయం తెలిసిందే. విషయంలోకి వస్తే, మల్లెల బాబ్జీ అనే వ్యక్తి హఠాత్తుగా ఎన్టీఆర్ వద్దకు వచ్చి ఆయన బొట నవేలిపై బ్లేడుతో గాయం చేశాడు. దీంతో సభలో కలకలం చెలరేగింది. ఎన్టీఆర్ కూడా బొటనవేలికి పెద్ద కట్టు కట్టుకుని కొద్ది రోజులు తిరిగారు. అయితే ‘అదంతా డ్రామా..’ అని అప్పట్లోనే ప్రజలు భావిం చారు. వాస్తవం ఏమిటంటే ప్రజల్లో ఎన్టీఆర్ ప్రభ తగ్గుతున్నవేళ మల్లెల బాబ్జి (పేద కాపు కులస్థుడు)తో ఆయన మీద ఉత్తుత్తి హత్య ప్రయత్నం చేయించి అందుకు బదులుగా మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి తరువాత మాట తప్పి చంద్రబాబు బాబ్జీ చేతిలో 30 వేలే పెట్టాడని ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధి రాశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు మల్లెల బాబ్జీ రాసిన రెండు లేఖలు దొరికితే వాటిలో ఈ నిజాలు బయటపడ్డాయని ఇండియా టుడే రాసింది. అప్పట్లో ఆ లేఖలు బయటపడితే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ రామారావు (ఆయన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు) ఇబ్బందుల్లో పడతారని పోలీసులూ, ఆ నాటి విజయవాడ ఎగ్జిక్యూటివ్ మేజి స్ట్రేట్ టీబీ బెనర్జీ దాచేశారని కూడా ఇండియా టుడే రాసింది. బాబ్జీ ఆత్మహత్య చేసుకున్న తరువాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంఘం ఎదుట ఈ లేఖలు బయట పడ్డాయని కూడా ఆ పత్రిక రాసింది. ఇంతకూ మల్లెల బాబ్జీది ఆత్మహత్యేనా అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఇటువంటి నేర బుద్ధి ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తూనే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి మీద దాడి తరువాత తాము మల్లెల బాబ్జీ చేత చేయించిన పనిని ఈ సంఘటనకు కూడా అంటగట్టి తప్పించుకోవచ్చనే నేర బుద్ధి కావచ్చు. అందుకోసం చాలా ప్రయత్నాలే చేశారు. ఫ్లెక్సీలు సృష్టించారు, పార్టీ నాయకులతో అడ్డగోలుగా మాట్లాడించారు, నెపం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. జగన్మోహన్ రెడ్డిని హత్య చెయ్యడానికి జరిగిన కుట్రలో భాగంగానే ఈ విఫలయత్నం జరిగిందని జనం గట్టిగా నమ్మడంతో దిక్కుతోచక కాంగ్రెస్‌తో దోస్తీ ప్రహసనాన్ని అడ్వాన్స్ చేశారు చంద్రబాబు. తన మీద తానే దాడి చేయించుకోవలసిన అవసరం జగన్‌కు ఏముంది? ఆనాడు ఎన్టీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది కాబట్టి సానుభూతి కోసం చంద్రబాబు మల్లెల బాబ్జీని ప్రయోగించారు. ఏడాది పొడుగునా పాదయాత్ర చేస్తూ రోజురోజుకూ జనాభిమానం పెంచుకుంటున్న జగన్‌కి ఆ అవసరం లేదు. నిజంగా ఆయనే చేయించుకుంటే ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రుజువు చెయ్యడం క్షణాల్లో జరిగే పని. దర్యాప్తు క్షుణ్ణంగా చేయించి నిజాలు నిగ్గు తేల్చండని జగన్ మోహన్‌రెడ్డి పట్టుబడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తూతూ మంత్రంగా జరిపించి మూసెయ్యాలని చూస్తోంది అంటేనే నేరం వెనక ఉన్నదెవరో, అది బయటపడుతుందని భయపడుతున్నదెవరో అర్థం అవుతున్నది. తానే దాడి చేయించుకుంటే నిందితుడు శ్రీనివాస్ దగ్గర దొరికిన 11 పేజీల లేఖలో ఈ దాడి చంద్రబాబు చేయించాడు అని రాసుకుంటారు కానీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానిని అని రాసుకోరు కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? అయినా ఆత్మహత్య చేసుకునే వారు కారణాలు తెలుపుతూ లేఖలు రాస్తారు (మల్లెల బాబ్జీ లాగా). వంగవీటి రంగా హంతకులెవరు? హత్యలు చేసేవారు ఆధారాలు తెలిపే లేఖలు రాసి వెంటపెట్టుకున్న చోద్యం మొదటిసారి చూస్తున్నాం. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవడం, అందుకోసం ప్రజాభిమానాన్ని చూరగొనడం కాకుండా కుట్ర పద్ధతుల్లో, అవసరం అయితే భౌతికంగా అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉందని ఆ పార్టీలో చాలా కాలం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన మాటల్లోనే ‘‘రంగాను హత్యచేయడానికి జరిగిన కుట్ర వెనక చంద్రబాబు, ఉపేంద్ర, సిరీస్ సుబ్బరాజుల హస్తాలు ఉన్నాయని శివరామరాజు నాతో చెప్పిన మాట నేను నమ్మాను. తెలుగుదేశం పార్టీ వారు ఒక కాపు నాయకుడిని తమకు వ్యతిరేక పార్టీలో ఉండి జనాదరణ పొందుతున్నాడన్న కారణంతో పాశవికంగా హతమార్చడం నన్ను కలచి వేసింది‘. హరిరామ జోగయ్య మాటలు విన్నాక రోజురోజుకూ పెరిగిపోతున్న జనాదరణ కారణంగా జగన్‌ను అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన ఎవరికి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. రంగా హత్యకు ముందు ఎన్టీ రామారావు హరిరామ జోగయ్యను పిలిచి మీ కులస్తులు ఎందుకు మన పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అని అడిగితే, రంగా భద్రతను తగ్గించడం కూడా ఒక కారణం అని జోగయ్య చెప్పారట. రంగా భద్రత పెంచడానికి అంగీకరించిన ఎన్టీఆర్ మరునాడు జోగయ్యను పిలిచి చంద్రబాబు తదితర నాయకులు ఇప్పుడు య«థాస్థితి కొనసాగించమని అంటున్నారు కాబట్టి భద్రత పెంచే వీలులేదని చెప్పారట, ఆ తరువాత కొద్ది కాలానికే రంగా దారుణ హత్యకు గురయ్యారు. ఇక చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ కేసులు తరుముకొస్తాయన్న భయం పట్టుకున్నట్టు స్పష్టం అవుతున్నది. నన్ను మీరే కాపాడాలి అని ప్రజలతో పదేపదే చెప్పుకోవడం, ఎవరో వ్యాపారుల మీద ఆదాయపు పన్ను దాడులు జరిగితే హాహాకారాలు చేస్తూ రాష్ట్రం మీద, ప్రభుత్వం మీదా దాడి జరిగినట్టు యాగీ చెయ్యడం ఆయనలో రోజురోజుకూ పెరుగుతున్న అభద్రతాభావానికి నిదర్శనం. వీటితో బాటు ప్రజా వ్యతిరేకత కారణంగా ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించాలి, రేపు ఏమయినా జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్నందువల్లనే కక్ష సాధిస్తున్నారని చెప్పుకోవాలి. ఇదీ చంద్రబాబు అనివార్యత. బాబు నోట విలువల విధ్వంసమా? ప్రజాస్వామ్య అనివార్యతలో భాగంగా వ్యవస్థలను రక్షించడానికి బయలుదేరానని చెపుతున్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలనూ తాను ఎలా ధ్వంసం చేసిందీ కనిపించక పోవడం ఆశ్చర్యకరం. ఈ విషయం శరద్ పవార్‌కో, ఫరూక్ అబ్దుల్లాకో తెలియదంటే అర్థం చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో రోజూ చంద్రబాబు దుష్పరిపాలన మీద పోరాటం చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికీ, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకూ ఎట్లా తెలియకుండా పోయింది? ముందు మీ రాష్ట్రంలో వ్యవస్థలను పునరుద్ధరించి అప్పుడు జాతీయ స్థాయి మాటలు మాట్లాడండి అని ఎందుకు అడగరు? నాలుగేళ్ళు బీజేపీ ఒళ్ళో కూర్చుని ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం దాన్ని వదిలేస్తే సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి నాయకుడు చంద్రబాబును భేష్ అని ఎట్లా వెన్నుతడతారు? బీజేపీని వ్యతిరేకిస్తే అన్నీ మాఫ్ చేసేస్తారా? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ధ్వంసం చెయ్యని వ్యవస్థ ఏదయినా ఉందా? ప్రతి పక్ష శాసన సభ్యులను, ఎంపీలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ఒడిగట్టి శాసన వ్యవస్థను, శాసన సభాపతి స్థానాన్ని భ్రష్టుపట్టించింది ఎవరు? శాసనసభను పార్టీ కార్యాలయంగా మార్చేసింది ఎవరు? అధికార యంత్రాం గాన్ని మొత్తం తన అదుపులో పెట్టుకున్నది ఎవరు? రాష్ట్రంలో చెలరేగిపోతున్న రకరకాల మాఫియాలకు అండగా నిలుస్తున్నది ఎవరు? బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నిటినీ కూడగడతానని బయలుదేరిన చంద్రబాబును ఈ జాతీయ పార్టీలన్నీ నిలదీసి ముందు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వం సాన్ని ఆపి, వాటిని స్వతంత్రంగా పని చేయనిచ్చి అప్పుడు జాతీయ స్థాయిలో ప్రక్షాళనకు రమ్మని ఎందుకు అడగరు? తన మీద వచ్చిన నేరారోపణల మీద స్టేలు తెచ్చుకుని అధికారంలో కొనసాగుతున్న నాయకుడికి విలువల గురించి, వ్యవస్థల విధ్వంసం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
యూపీ చిన్నబాబుకు రాహుల్ అనూహ్య ప్రశంసలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి ఊహించని ప్రశంసలు లభించాయి. 43 ఏళ్ల అఖిలేశ్‌ను ‘మంచి బాలుడు’ (థీక్ లడ్క) అంటూ మెచ్చుకున్నారు. అయితే, వ్యక్తిగతంగా అఖిలేశ్ ను గుడ్‌బాయ్ అని మెచ్చుకున్న రాహుల్.. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. లక్నోలో శుక్రవారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార భేరిని మోగించిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యువ ముఖ్యమంత్రిని చూడండి. ఆయన మంచి బాలుడు. కానీ ఆయన ప్రభుత్వం మాత్రం పనిచేయడం లేదు’ అని విమర్శించారు. ఎస్పీ ప్రభుత్వం హయాంలో యూపీలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని ఆయన మండిపడ్డారు. ఒకవైపు బీఎస్పీ అవినీతిని ప్రోత్సహిస్తుంటే, మరోవైపు ఎస్సీ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నదని దుయ్యబట్టారు.