న్యూఢిల్లీ: వీలు దొరికినపుడల్లా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని హిమంత ఈసారి ఏకంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌తో పోల్చారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు.
ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ బాబా సిద్ధికీ రాహుల్ గాంధీ టీమ్‌పై చేసిన బాడీ షేమింగ్ ఆరోపణలపై హిమంత స్పందించారు. నార్త్ కొరియా నియంత కిమ్ ఒక్కడే తనతో ఫొటో దిగే పార్టీ కార్యకర్తలు ఫొటోజెనిక్‌గా ఉండాలని కోరుకుంటారని హిమంత రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కలవాలని వెళ్లిన తనను 10 కేజీల వెయిట్ తగ్గి రావాల్సిందిగా రాహుల్ టీమ్ సభ్యులు సూచించారని బాబా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు సంచనం రేపాయి.
కాగా, గత నెలలో అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన సమయంలో హిమంత ప్రభుత్వం రాష్ట్రంలో యాత్రకు చాలా షరతులు విధించింది. గువహతిలోకి యాత్ర ప్రవేశించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి రాహుల్‌గాంధీపై అస్సాం సీఐడీ కేసు కూడా పెట్టింది. త్వరలో ఈ కేసులో సీఐడీ రాహుల్‌కు సమన్లు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది.
The only other person, I can think of, who makes such ridiculous demands from his party workers – that they should look nice and photogenic – is a dynast who rules North Korea. https://t.co/sAlcMoOwPQ
— Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024
Comments
Please login to add a commentAdd a comment