weight reduction
-
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్
న్యూఢిల్లీ: వీలు దొరికినపుడల్లా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని హిమంత ఈసారి ఏకంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌తో పోల్చారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ బాబా సిద్ధికీ రాహుల్ గాంధీ టీమ్‌పై చేసిన బాడీ షేమింగ్ ఆరోపణలపై హిమంత స్పందించారు. నార్త్ కొరియా నియంత కిమ్ ఒక్కడే తనతో ఫొటో దిగే పార్టీ కార్యకర్తలు ఫొటోజెనిక్‌గా ఉండాలని కోరుకుంటారని హిమంత రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కలవాలని వెళ్లిన తనను 10 కేజీల వెయిట్ తగ్గి రావాల్సిందిగా రాహుల్ టీమ్ సభ్యులు సూచించారని బాబా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు సంచనం రేపాయి. కాగా, గత నెలలో అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన సమయంలో హిమంత ప్రభుత్వం రాష్ట్రంలో యాత్రకు చాలా షరతులు విధించింది. గువహతిలోకి యాత్ర ప్రవేశించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి రాహుల్‌గాంధీపై అస్సాం సీఐడీ కేసు కూడా పెట్టింది. త్వరలో ఈ కేసులో సీఐడీ రాహుల్‌కు సమన్లు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. The only other person, I can think of, who makes such ridiculous demands from his party workers – that they should look nice and photogenic – is a dynast who rules North Korea. https://t.co/sAlcMoOwPQ — Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024 ఇదీ చదవండి.. రాహుల్‌ను కలవాలంటే 10 కేజీలు తగ్గమన్నారు -
ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర!
ఊబకాయులకు ఓ శుభవార్త. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒళ్లు తగ్గడం లేదన్న మీ బెంగ త్వరలోనే తీరబోతోంది. ఎందుకంటే మధుమేహానికి వాడే సెమాగ్లుటైడ్ అనే మందు శరీరాన్ని తగ్గించేందుకు భేషుగ్గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకలిని నియంత్రించే వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందును వాడిన ఊబకాయుల్లో 33 శాతం మంది బరువు తగ్గారు. అది కూడా వారి శరీర బరువులో 20 శాతం వరకు తగ్గుదల నమోదు కావడం విశేషం. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారందరూ వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా బరువు తగ్గేందుకు సాధారణంగా ఆచరించే పద్ధతులన్నింటినీ కొనసాగించారు. సెమాగ్లుటైడ్ అనేది ఆకలి భావనను తగ్గిచేందుకు ప్రకృతిలో లభించే జీఎల్పీ–1 హార్మోన్ మాదిరిగా ఉంటుంది. 2017లో దీన్ని బరువు తగ్గించేందుకూ ఉపయోగించొచ్చా? అన్నది పరిశీలించి సానుకూల ఫలితాలు సాధించారు కూడా. అప్పట్లో 28 మంది ఊబకాయులకు ఈ మందు ఇవ్వగా, ఆకలి తగ్గిపోయిన కారణంగా 12 వారాల తర్వాత వీరి శరీర బరువు సగటున 5 కిలోల వరకు తగ్గింది. ప్రస్తుతం మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్నాయి. 16 దేశాల్లోని 129 ప్రాంతాల్లో 2 వేల మందిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తం 68 వారాల పాటు ఈ ప్రయోగాలు జరగ్గా కొంతమందికి వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్, మరి కొంతమందికి ఉత్తుత్తి ఇంజెక్షన్ ఇచ్చారు. ఉత్తుత్తి ఇంజెక్షన్ ఇచ్చిన వారు సగటున 2.6 కిలోల బరువు తగ్గగా, బాడీ మాస్ ఇండెక్స్ కూడా 0.92 వరకు తగ్గింది. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ తీసుకున్న వారు సగటున 15.3 కిలోల బరువు తగ్గారు. బీఎంఐ తగ్గుదల 5.54గా నమోదైంది. గుండెజబ్బుకు కారణాలైన మధుమేహం, రక్తపోటు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. -
ప్రపంచ భారీ బాలుడు.. బరువు తగ్గాడు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత బరువైన బాలుడు మిహిర్ జైన్(237కిలోలు)కు వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా 60కిలోల బరువును తగ్గించారు. వ్యక్తుల ఎత్తు, బరువు ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) లెక్కిస్తారు. బీఎమ్ఐ విలువ 22.5గా ఉంటే సాధారణ వ్యక్తిగా, 32.5గా ఉంటే ఊబకాయుడిగా పరిగణిస్తారు. ఇలాంటి వారికి శస్త్ర చికిత్సను సిఫార్సు చేస్తారు. అయితే ఢిల్లీలోని ఉత్తర్ నగర్‌కు చెందిన మిహిర్ జైన్ (14) బాలుడు 237 కిలోల బరువు పెరగడంతో అతడి బీఎంఐ 92కు చేరింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన టీనేజ్ ఊబకాయుడికి వైద్యులు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దీంతో మిహిర్ దాదాపు 60కిలోల బరువు తగ్గాడు. నవంబర్ 2003లో పుట్టినప్పుడు మిహిర్ 2.5 కిలోలు బరువు ఉండేవాడు, కానీ క్రమంగా బరువు పెరుగుతూ ఐదేళ్ల నాటికి 60 నుంచి 70 కిలోలకు చేరుకున్నాడని తల్లి పూజా తెలిపారు. తమ కుటుంబంలో అందరూ బలంగానే ఉండటంతో దీన్ని అంతగా పట్టించుకోలేదని ఆమె తెలియజేశారు. అయితే కొద్ది కాలానికి లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో 2వ తరగతి నుంచి స్కూల్ మాన్పించి, ఇంటి దగ్గరే పాఠాలు బోధించినట్టు పూజా పేర్కొన్నారు. 2010లో తొలిసారిగా వైద్య సాయం కోసం ప్రయత్నించాం కానీ, ఆపరేషన్‌కు తగిన వయసు కాదని వైద్యులు తిరస్కరించారని చెప్పారు. తక్కువ కేలరీల ఆహారం అందించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార కట్టడితో 40 కిలోలు తగ్గాడు. అనంతరం మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు గ్యాస్టిక్ బైపాస్ సర్జరీ చెసి బరువును తగ్గించారు. దీనిపై డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. మిహిర్‌ను తొలిసారి చూడగానే అతడికి శస్త్రచికిత్స విజయవంతమవుతుందనే నమ్మకం కలగలేదన్నారు. ‘శస్త్ర చికిత్సకు ముందు మాకు పూర్తి నమ్మకం కలగలేదు. అందుకే తక్కువ కేలరీల ఆహారం ముందు సిఫార్సు చేశాం. దీంతో అతని బరువు 196 కిలోలకు తగ్గింది. ఈ దశలో అతనికి సర్జరీ చేయాలని నిర్ణయించాం. విపరీతమైన స్థూలకాయం కారణంగా మిహిర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా అతనికి సర్జరీ చేయడం కోసం ప్రత్యేక పరికరాలను ఉపయోగించవలసి వచ్చింది’ అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు. డాక్టర్ల ప్రయత్నం వల్ల మిహిర్ సర్జరీ విజయవంతంగా జరిగింది. వారం రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతనికి పరిమిత ఆహారం తినాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం అతను 177 కిలోల బరువు ఉన్నాడు. అతని బరువును మూడేళ్లలో 100 కిలోలకు తగ్గించాలన్నది తమ లక్ష్యమని డాక్టర్లు తెలిపారు. -
బరువు తగ్గించే స్మార్ట్‌ఫోన్ యాప్‌లు?
మీరు బాగా బరువు ఎక్కువైపోయానని బాధపడుతున్నారా? తగ్గించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే.. ఒక్కసారి మీ స్మార్ట్‌ఫోన్ తీసుకుని అందులో ఓ యాప్ వేసుకోండి. మీ బరువు ఎలా తగ్గాలో అదే చెబుతుంది. మీ చేత అన్నీ చేయిస్తుంది కూడా. చాలామంది ఈ తరహా యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నా, దాంట్లో సూచనలను పూర్తిగా పాటించకుండా, సగంలోనే వదిలేయడం వల్లే వాళ్లు బరువు తగ్గట్లేదన్న ఫిర్యాదులు వస్తున్నట్లు తాజా పరిశోధనలలో తేలింది. ఇందుకోసం అమెరికాలో 212 మంది ప్రైమరీ కేర్ పేషెంట్లను ఆరు నెలల పాటు పరిశీలించారు. వాళ్లంతా 25కు పైగా బీఎంఐ ఉన్నవాళ్లే. వాళ్లలో సగం మందికి మైఫిట్నెస్పాల్ అనే యాప్ వాళ్ల ఫోన్లలో వేసి ఇచ్చారు. మిగిలిన వాళ్లకు ఆ యాప్ ఇవ్వలేదు. ఆరు నెలల తర్వాత పరిశీలించి చూస్తే, యాప్ వేసుకున్న బృందంలోని వాళ్లు అది లేనివాళ్ల కంటే బరువు బాగా తగ్గారు. చాలామంది యూజర్లు ఈ యాప్ వల్ల ఉపయోగం ఉందని భావించగా, మొదటి రెండు నెలల తర్వాత మాత్రం యాప్‌ను ఉపయోగించడం బాగా తగ్గిందట. మార్కెట్లో ఇంకా ఇలా బరువు తగ్గించే యాప్‌లు చాలానే ఉన్నాయి.