బరువు తగ్గించే స్మార్ట్ఫోన్ యాప్లు?
మీరు బాగా బరువు ఎక్కువైపోయానని బాధపడుతున్నారా? తగ్గించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే.. ఒక్కసారి మీ స్మార్ట్ఫోన్ తీసుకుని అందులో ఓ యాప్ వేసుకోండి. మీ బరువు ఎలా తగ్గాలో అదే చెబుతుంది. మీ చేత అన్నీ చేయిస్తుంది కూడా. చాలామంది ఈ తరహా యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నా, దాంట్లో సూచనలను పూర్తిగా పాటించకుండా, సగంలోనే వదిలేయడం వల్లే వాళ్లు బరువు తగ్గట్లేదన్న ఫిర్యాదులు వస్తున్నట్లు తాజా పరిశోధనలలో తేలింది. ఇందుకోసం అమెరికాలో 212 మంది ప్రైమరీ కేర్ పేషెంట్లను ఆరు నెలల పాటు పరిశీలించారు. వాళ్లంతా 25కు పైగా బీఎంఐ ఉన్నవాళ్లే.
వాళ్లలో సగం మందికి మైఫిట్నెస్పాల్ అనే యాప్ వాళ్ల ఫోన్లలో వేసి ఇచ్చారు. మిగిలిన వాళ్లకు ఆ యాప్ ఇవ్వలేదు. ఆరు నెలల తర్వాత పరిశీలించి చూస్తే, యాప్ వేసుకున్న బృందంలోని వాళ్లు అది లేనివాళ్ల కంటే బరువు బాగా తగ్గారు. చాలామంది యూజర్లు ఈ యాప్ వల్ల ఉపయోగం ఉందని భావించగా, మొదటి రెండు నెలల తర్వాత మాత్రం యాప్ను ఉపయోగించడం బాగా తగ్గిందట. మార్కెట్లో ఇంకా ఇలా బరువు తగ్గించే యాప్లు చాలానే ఉన్నాయి.