మాకు నితీష్‌ అవసరం లేదు: రాహుల్‌ | Rahul Gandhi First Reaction On Bihar CM Nitish Kumar After Switch To NDA | Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత ఇండియా కూటమిది.. నితీష్‌ అవసరం లేదు: రాహుల్‌

Published Tue, Jan 30 2024 4:12 PM | Last Updated on Tue, Jan 30 2024 6:03 PM

Rahul Gandhi First Reaction On Bihar CM Nitish Kumar After Switch To NDA  - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘ భారత జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బిహార్‌లో సాగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వైదోలిగన మరుసటి రోజే(సోమవారం) కిషన్‌గంజ్‌ నుంచి రాహుల్‌ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూర్నియాలో రాహుల్‌ యాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగింస్తూ.. తొలిసారి నితీష్‌ కుమార్‌ ఎన్డీయే గూటికి చేరడంపై స్పందించారు. బిహార్‌లో సామాజిక న్యాయం అందించే బాధ్యత ఇండియా కూటమి తీసుకుందని.. ఇకపై బిహార్‌కు నితీష్‌ అవసరం లేదని అన్నారు.  బీజేపీ ఉచ్చులో నితీష్‌ చిక్కకున్నారని మండిపడ్డారు. మహాఘట్‌ బంధన్‌ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తామని చెప్పారు.

మోదీ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు రాహుల్‌. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి కులగణన ఎంతో అవసరమన్న ఆయన భారత్‌లో నిరుద్యోగం  పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్‌ సింగ్ సంధూ.. ఎవరీయన?

 ఇదిలా ఉండగా క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌  కుంభకోణంలో ఈడీ దర్యాప్తుకు హాజరైన నేపథ్యంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, లాలు ప్రసాద్‌ యాదవ్‌ సహా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అగ్రనేతలు నేడు  పూర్నియాలో రాహుల్‌  భారత్ జోడో న్యాయ్ యాత్ర ర్యాలీకి దూరంగా ఉన్నారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం బీహార్‌లోని పూర్నియాలో రైతు సంఘం సభ్యులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓ ధాబాలో టీ తాగుతూ కొంతమంది బీహార్ నివాసితులతో మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నేత కన్నయ్య కుమార్‌ కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement