మొదట్నుంచీ విభిన్న పంథాలో నడుస్తున్న ఆరవింద్ కేజ్రీవాల్ భద్రత విషయంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు.
న్యూఢిల్లీ: మొదట్నుంచీ విభిన్న పంథాలో నడుస్తున్న ఆరవింద్ కేజ్రీవాల్ భద్రత విషయంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నందున నిబంధనల ప్రకారం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తామన్న ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. తనకు దేవుడే పెద్ద రక్షకుడని, ఎలాంటి అదనపు భద్రత అక్కర్లేదని పేర్కొంటూ సోమవారం ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. ఎస్కార్టు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది(పీఎస్‌వో) కూడా వద్దని సూచించారు. ‘‘నాకు సెక్యూరిటీ కల్పించాలన్న మీ ప్రతిపాదనకు కృతజ్ఞతలు. మీకు ఇంతకుముందే చెప్పినట్లు నాకు ఎలాంటి భద్రత అవసరం లేదు. దేవుడే నాకు పెద్ద రక్షకుడు. అయితే నేను ప్రసంగించే వేదికల వద్ద జన సమూహాన్ని నియంత్రించేందుకు సాయంగా ఉండండి’’ అని తన లేఖలో అరవింద్ పేర్కొన్నారు.