మోడీ భార్యకు జెడ్ కేటగిరి భద్రత కల్పించండి | Congress demands Z-category security for Narendra Modi's wife | Sakshi
Sakshi News home page

మోడీ భార్యకు జెడ్ కేటగిరి భద్రత కల్పించండి

Published Sun, Apr 13 2014 3:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Congress demands Z-category security for Narendra Modi's wife

భోపాల్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ గాక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ డిమాండ్ రావడం విశేషం. ఉగ్రవాదులకు ఆమె లక్ష్యంగా మారే అవకాశముందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అభయ్ దుబె, రవి సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకే ఈ మేరకు లేక రాశారు.

చిన్న వయసులోనే జశోదా బెన్ను వివాహం చేసుకున్న మోడీ మూడేళ్లు మాత్రం కలిసున్నారు. ఆ తర్వాత వైవాహిక జీవితానికి పూర్తిగా దూరమై రాజకీయాల్లో నిమగ్నమైపోయారు. కాగా తన వైవాహిక జీవితంపై ఎన్ని విమర్శలు వచ్చినా స్పందించని మోడీ తాజా ఎన్నికల నామినేషన్లో తన భార్య పేరును ప్రస్తావించారు. దీంతో జశోదా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement