
అమిత్ షాకు జెడ్ ప్లస్ భద్రత
ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. అమిత్ షా భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందన్న భావనతోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయంతీసుకున్నట్టు అధికారవర్గాలు బుధవారం తెలిపాయి.
జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా, అమిత్ షాకు సీఆర్‌పీఎఫ్ కమాండోలు 24గంటలూ భద్రత కల్పిస్తారని, ఆయన నివాసం వద్ద సాయుధ గార్డులతో రక్షణ ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. అమిత్ షా దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఆయనకు ఉన్నతస్థాయి భద్రత కల్పిస్తారు. ఆయనకు ఇప్పటి వరకూ గుజరాత్ పోలీసుల భద్రత కల్పిస్తూవస్తున్నారు.