అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: చేతిపై జీవనరేఖ చాలా పొడవుగా ఉందని, తన ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని, తనకు భద్రత అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... తనకు భద్రత అవసరం లేదన్నారు. కేజ్రీవాల్ నివాసం యూపీలోని ఘజియాబాద్‌లో ఉన్నందువల్ల ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కారుకు లేఖ రాయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత సమకూర్చింది. అయి తే కేజ్రీవాల్ దీనిపై ప్రతిస్పందిస్తూ తనకు భద్రత అవసరం లేదని చెప్పారు. తన చేతిలో జీవన రేఖ చా లా పొడవుగా ఉందని ఆయన నవ్వుతూ అన్నారు.
ప్రజలతో మమేకం కావడానికే రోడ్లపై జనతా దర్బార్...
ప్రజలతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడం కోసమే రోడ్డుపై జనతా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజల మనసులలో ఎన్నో గోడలున్నాయని, పెద్ద బంగ్లా, పెద్ద వాహనం, ఎర్రబుగ్గ చూసి వారు వెనుకంజ వేస్తారని, సచివాలయం వంటి సువిశాలమైన ప్రభుత్వ కార్యాలయంలోకి రావడానికి భయపడతారని, జనాల మనసుల్లోని ఈ అడ్డుగోడల హద్దును తొలగించడం కోసమే రోడ్డుపై ప్రజలను కలవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
అవినీతిపై ఉక్కుపాదమే..!
ఆప్ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక చర్యలు చేపట్టడంలో చిన్న చేపలపై దృష్టి సారిస్తూ పెద్ద చేపలను ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ఉన్న అవినీతి ఆరోపణల విషయంలో మిన్నకుండి పోతుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అవినీతి విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని ఈ విషయంలోనూ చర్యలు చేపడతామని చెప్పారు. విద్యుత్తు కంపెనీలు తమ ఆర్థిక వ్యవహారాలను తామే చక్కదిద్దుకోవాలన్నారు.
ఆప్‌పై కిరణ్‌బేడీ విమర్శలు...
జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలో కేజ్రీవాల్‌తో కలసి పనిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీపై కిరణ్ బేడీ సంధించారు. ఆప్ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ ప్రారంభించడంతోపాటు షీలాదీక్షిత్‌ను తప్పుపట్టిన లోకాయుక్తా నివేదికపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.