
నేటి నుంచి కేజ్రీవాల్‌కు ‘జెడ్’ భద్రత
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు ఘజియాబాద్ ఎస్‌ఎస్పీ ధర్మేంద్ర సింగ్ తెలిపారు.
ఘజియాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు ఘజియాబాద్ ఎస్‌ఎస్పీ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. వ్యక్తిగత భద్రతను కేజ్రీవాల్ పదేపదే నిరాకరిస్తున్నప్పటికీ యూపీ సర్కార్ ఆదేశాల మేరకు తామీ నిర్ణయం తీసుకున్నట్టు సింగ్ ఆదివారం ఇక్కడ వివరించారు. సోమవారం నుంచి 30 మంది సిబ్బందితో కూడిన పోలీసు బృందం 24 గంటలూ కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తుందని, వీరిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారని వివరించారు. అదేవిధంగా కేజ్రీవాల్ నివసిస్తున్న ఘజియాబాద్‌లోని కౌశాంబిలో ఉన్న గిరినార్ అపార్ట్‌మెంట్ వెలుపల 8 మంది పోలీసులు భద్రత కల్పిస్తారని తెలిపారు.