
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రామస్వామి సంతోష్‌రెడ్డి. శుక్రవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆలిండియా 4వ ర్యాంక్ దక్కించుకున్నాడు. 360 మార్కులకు గాను 331 మార్కులు సాధించాడు. రైతు చంద్రశేఖర్‌రెడ్డి, సంతోష దంపతుల కుమారుడైన సంతోష్‌రెడ్డి బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ఐఐటీలో ర్యాంక్ సాధించాలన్నది ఇతని బలమైన కోరిక.
కల నెరవేరింది...: ‘మొదటి నుంచి నాకు ఐఐటీ చదవాలని కోరిక. అందుకు అనుగుణంగా పరీక్షకు సిద్ధమయ్యా. మంచి ర్యాంక్ వస్తుంది అనుకొన్నా. కానీ, ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. నా కల నెరవేరినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ కోర్సులో చేరతా.