పెళ్లి పీటలెక్కిన బన్నీ హీరోయిన్‌ | Actress Sheela Kaur Gets married Business Man Santosh Reddy | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న ‘పరుగు’ హీరోయిన్‌

Mar 14 2020 12:56 PM | Updated on Mar 14 2020 1:16 PM

Actress Sheela Kaur Gets married Business Man Santosh Reddy - Sakshi

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పరుగు’ సినిమాతో  తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్‌ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్‌ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేశారు. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం. గుండె లోతుల్లో సంతోషం నిండుకుంది. మేమిద్దరం కలిసి  నూతన జీవితాన్ని ఆరంభించే ఓ కొత్త రోజు’ అంటూ ఫేస్‌బుక్‌లో పెళ్లి ఫోటో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షీలాకు అభినందనలు తెలుపుతున్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు)

2006లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన షీలా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం బాషల్లో నటించారు. అనంతరం మనోజ్‌ ‘రాజుభాయ్‌’, ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’, రామ్‌ ‘మస్కా’, బాలయ్య ‘పరమవీర చక్ర’ వంటి సినిమాల్లో నటించారు. అయితే షీలాకు అవేవి మంచి హిట్‌ను అందిచకపోయినా.. పరుగు సినిమా మాత్రం ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది.. 2011లో విడుదలైన బాలకృష్ణ పరమవీర చక్ర సినిమాలో తెలుగు తెరపై చివరిసారిగా కనిపించారు. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. (బిగ్‌బాస్‌-4: హోస్ట్‌గా మహేశ్‌ బాబు!)

చదవండికేజీఎఫ్‌ 2 : డేట్‌ గుర్తుపెట్టుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement