Parugu
-
‘పరుగు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
టాలీవుడ్లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొంతమంది మాత్రమే నిలకడగా రాణిస్తారు. మరికొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలు చేసినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో షీలా కౌర్ ఒకరు. అల్లు అర్జున్ ‘పరుగు’ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. అంతకు ముందు చైల్డ్ ఆరిస్ట్‌గా దాదాపు 20 సినిమాల్లో నటించిన షీలా.. నవదీప్ ‘సీతాకోక చిలుక’తో హీరోయిన్గా మారింది. ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అందులో అమాయకంగా కనిపిస్తూనే తనదైన నటన,అందంతో కుర్రకారులను ఆకర్షించింది. ఆ సినిమాలో ‘ముఖం చూపించి మాట్లాడు..’ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. పరుగు తర్వాత రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్ తదితర తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించింది. చివరిగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఆమె క్యాన్సర్ బారిన పడ్డారని, అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారని అప్పట్లో వదంతులు వచ్చాయి. మూడేళ్ల క్రితం ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది షీలా. 2020 మార్చిలో కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో సీలా వివాహం జరిగింది. చెన్నైలో కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఈ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి పీటలెక్కిన బన్నీ హీరోయిన్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం. గుండె లోతుల్లో సంతోషం నిండుకుంది. మేమిద్దరం కలిసి నూతన జీవితాన్ని ఆరంభించే ఓ కొత్త రోజు’ అంటూ ఫేస్బుక్లో పెళ్లి ఫోటో షేర్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షీలాకు అభినందనలు తెలుపుతున్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) 2006లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన షీలా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం బాషల్లో నటించారు. అనంతరం మనోజ్ ‘రాజుభాయ్’, ఎన్టీఆర్ ‘అదుర్స్’, రామ్ ‘మస్కా’, బాలయ్య ‘పరమవీర చక్ర’ వంటి సినిమాల్లో నటించారు. అయితే షీలాకు అవేవి మంచి హిట్‌ను అందిచకపోయినా.. పరుగు సినిమా మాత్రం ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది.. 2011లో విడుదలైన బాలకృష్ణ పరమవీర చక్ర సినిమాలో తెలుగు తెరపై చివరిసారిగా కనిపించారు. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. (బిగ్‌బాస్-4: హోస్ట్‌గా మహేశ్ బాబు!) చదవండి : కేజీఎఫ్ 2 : డేట్ గుర్తుపెట్టుకోండి -
బొమ్మరిల్లు భాస్కర్‌కు మరో ఛాన్స్
బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్, ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాప్ రావడంతో భాస్కర్ కెరీర్ తిరగబడింది. ఆ తరువాత ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఒంగోళుగిత్తకు కూడా ఫ్లాప్ టాక్ రావటంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, ఇటీవల బెంగళూర్ డేస్ తమిళ రీమేక్‌తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. మరోసారి తెలుగులో దర్శకుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయాత్నాలు ప్రారంభించిన భాస్కర్‌కు మెగా ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే మెగా హీరోస్తో పరుగు, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కించిన భాస్కర్, ఈ సారి అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే లైన్ ఓకె చేసిన అరవింద్, పూర్తి కథతో రమ్మన్నాడట. కథ రెడీ అయ్యాక నటీనటుల ఎంపిక జరుగనుంది. అయితే మరోసారి మెగా హీరోతోనే సినిమా చేస్తాడా..? లేక.. లో బడ్జెట్లో చిన్న హీరోతో సినిమాను చేస్తారా..? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.