Maska
-
పెళ్లి పీటలెక్కిన బన్నీ హీరోయిన్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం. గుండె లోతుల్లో సంతోషం నిండుకుంది. మేమిద్దరం కలిసి నూతన జీవితాన్ని ఆరంభించే ఓ కొత్త రోజు’ అంటూ ఫేస్బుక్లో పెళ్లి ఫోటో షేర్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షీలాకు అభినందనలు తెలుపుతున్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) 2006లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన షీలా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం బాషల్లో నటించారు. అనంతరం మనోజ్ ‘రాజుభాయ్’, ఎన్టీఆర్ ‘అదుర్స్’, రామ్ ‘మస్కా’, బాలయ్య ‘పరమవీర చక్ర’ వంటి సినిమాల్లో నటించారు. అయితే షీలాకు అవేవి మంచి హిట్‌ను అందిచకపోయినా.. పరుగు సినిమా మాత్రం ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది.. 2011లో విడుదలైన బాలకృష్ణ పరమవీర చక్ర సినిమాలో తెలుగు తెరపై చివరిసారిగా కనిపించారు. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. (బిగ్‌బాస్-4: హోస్ట్‌గా మహేశ్ బాబు!) చదవండి : కేజీఎఫ్ 2 : డేట్ గుర్తుపెట్టుకోండి -
మనీషా మస్కా
హీరోయిన్ మనీషా కొయిరాల మస్కా కొట్టనున్నారు. ఏ ట్రిక్స్‌తో పక్కవారిని మనీషా మస్కా కొట్టించారో త్వరలో వెబ్ ఫిల్మ్‌లో చూడొచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘మస్కా’ అనే వెబ్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేసింది. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘మస్కా’లో మనీషా కొయిరాల, గాయని షెర్లీ, నటి నికితా దత్తా, నటుడు ప్రీత్ కమాని ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. నీరజ్ ఉద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘యాక్టర్‌గా నేను గర్వపడేలా ఉంటుందీ వెబ్‌ఫిల్మ్’’ అన్నారు మనీషా. హీరోయిన్ కావాలనుకునే ఓ కన్ఫ్యూజ్డ్ అమ్మాయి సక్సెస్ జర్నీ ఆధారంగా ‘మస్కా’ ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇంతకుముందే ‘లస్ట్‌స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌తో మనీషా డిజిటల్ ఆడియన్స్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు మస్కాతో మరోసారి డిజిటల్ ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు. -
సికింద్రాబాద్‌లో కిలాడీజంట
-
కనురెప్పల సోయగం...
బ్యూటిప్స్ ఆర్టిఫీషియల్ ఐ లాషెస్తో కళ్లను మీనాల్లా మెరిపించవచ్చని తెలిసినా కూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే... ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ (సౌందర్యసాధనాల మార్కెట్లో దొరుకుతాయి) ఒక సెట్, వాటిని అమర్చడానికి ఐలాష్ గ్లూ తీసుకోవాలి. వీటితోపాటు కత్తెర, ట్వీజర్, ఐ లాష్ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి. ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ మరీ పొడవుగా ఉన్నట్లనిపిస్తే తగినంత మేర ట్రిమ్ చేయాలి. ట్వీజర్ సహాయంతో లాషెస్‌కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమర్చాలి. గ్లూ ఆరి లాషెస్ సెట్ అయ్యే వరకు ఆగాలి. స్కిన్‌కు అంటుకోకుండా గ్లూ విడిగా ఆరిపోతున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపించినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్ లాషెస్ కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్లు మెల్లగా నొక్కాలి. గ్లూ ఆరిన తర్వాత లాషెస్‌కు డార్క్ షేడ్ ఐ లైనర్ అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్ లాషెస్‌కు మధ్య తేడా కనిపించకుండా అంతా ఒకేలా ఉంటాయి. చివరగా ఐలాష్ కర్లర్‌తో వంపు తిప్పాలి. అవసరమనిపిస్తే (మరింత డార్క్‌గా కనిపించాలనుకుంటే) మస్కారా అప్లయ్ చేయాలి.