
హీరోయిన్ మనీషా కొయిరాల మస్కా కొట్టనున్నారు. ఏ ట్రిక్స్‌తో పక్కవారిని మనీషా మస్కా కొట్టించారో త్వరలో వెబ్ ఫిల్మ్‌లో చూడొచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘మస్కా’ అనే వెబ్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేసింది. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘మస్కా’లో మనీషా కొయిరాల, గాయని షెర్లీ, నటి నికితా దత్తా, నటుడు ప్రీత్ కమాని ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
నీరజ్ ఉద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘యాక్టర్‌గా నేను గర్వపడేలా ఉంటుందీ వెబ్‌ఫిల్మ్’’ అన్నారు మనీషా. హీరోయిన్ కావాలనుకునే ఓ కన్‌ఫ్యూజ్డ్ అమ్మాయి సక్సెస్ జర్నీ ఆధారంగా ‘మస్కా’ ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇంతకుముందే ‘లస్ట్‌స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌తో మనీషా డిజిటల్ ఆడియన్స్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు మస్కాతో మరోసారి డిజిటల్ ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు.