Lingu Swami
-
షూటింగ్లో కమలహాసన్‌కు గాయాలు
ప్రముఖ నటుడు కమలహాసన్ షూటింగ్లో ప్రమదం కారణంగా గాయాలకు గురయ్యారు. దీంతో ఉత్తమ విలన్ షూటింగ్ రద్దయిం ది. కమలహాసన్ తాజాగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమవిలన్ చిత్రా న్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం చిత్రంలో కమలహాసన్ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమా దం జరిగి ఆయన కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో షూటింగ్ రద్దు అయినట్లు దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. కమల్‌కు పూర్తిగా ఆర్యోగం చేకూరిన తరువాత ఉత్తమ విలన్ షూటింగ్ చేస్తామని ఆయన తెలిపారు. -
స్టయిలిష్ డాన్‌గా సూర్య
సూర్య తొలిసారిగా డాన్ పాత్ర పోషిస్తున్నారు. చాలా స్టయిలిష్‌గా ఉండే డాన్ పాత్ర కావడంతో సూర్య కూడా ఎంతో ఆసక్తిగా ఈ పాత్ర చేస్తున్నారు. రన్, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు నాట కూడా అభిమానుల్ని సంపాదించుకున్న దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం గురించి లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ -‘‘భారీ తారాగణంతో, 75 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కు ‘అంజాన్’ టైటిల్ కాగా, తెలుగు వెర్షన్‌కు త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. ఇందులో సూర్య పాత్రచిత్రణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సమంత మునుపెన్నడూ లేనంతగా గ్లామర్ ప్రదర్శన చేశారు. యువన్ శంకర్‌రాజా సంగీతం, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు కీలకం. ప్రముఖ బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ ఇందులో ప్రత్యేక నృత్యగీతం చేశారు’’ అని తెలిపారు. బ్రహ్మానందం, విద్యుత్ జమాల్, మనోజ్ బాజ్‌పాయ్, కెల్లీ డోర్జ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
కాజల్‌కు రూ.2 కోట్లు
నటి కాజల్ అగర్వాల్ పని అయిపోయింది. ఆమెకు అవకాశాల్లేవు. పెళ్లికి సిద్ధం అవుతుంది. వరుడి వేటలో కుటుంబ సభ్యులున్నారు లాంటి పసలేని ప్రచారాలెన్నో జరిగాయి. వీటిలో ఏ ఒక్క ప్రచారానికీ కాజల్ స్పందించలేదు. కాలమే సమాధానం చెబుతుందన్న విశ్వాసం కావచ్చు. సరిగ్గా అలాంటి సమయమే ఆసన్నమైంది. ఈ ముద్దుగుమ్మ రెండు కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల క్లబ్లో చేరబోతోంది. ఈ బ్యూటీకి రెండు కోట్లు పారితోషికం చెల్లించడానికి దర్శక, నిర్మాత లింగుస్వామి సమ్మతించినట్లు తాజా సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ హీరోగా ఈయన నిర్మించనున్న ఉత్తమ విలన్ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ పాత్ర కోసం ముందు అనుష్క పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆమె రెండు భారీ చిత్రాల్లో బిజీగా ఉండటంతో కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం కాజల్‌ను వరించింది. ఈ భామ తాను యువ హీరోల సరసన మాత్రమే నటిస్తానని బెట్టు చేయడంతో నిర్మాత రెండు కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట. అంత పారితోషికం ఇస్తానంటే ఏ హీరోయిన్ మాత్రం కాదనజాలదు. కాజల్ కూడా ఓకే అంటూ తలాడించేసిందట. కాజల్, విజయ్‌తో జతకట్టిన తాజా చిత్రం జిల్లా సంక్రాంతి రేసుకు సిద్ధం అవుతోంది