కాజల్‌కు రూ.2 కోట్లు | Kajal Agarwal Got 2 crore for act with kamal haasan | Sakshi
Sakshi News home page

కాజల్‌కు రూ.2 కోట్లు

Published Thu, Dec 26 2013 4:46 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కాజల్‌కు రూ.2 కోట్లు - Sakshi

కాజల్‌కు రూ.2 కోట్లు

నటి కాజల్ అగర్వాల్ పని అయిపోయింది. ఆమెకు అవకాశాల్లేవు. పెళ్లికి సిద్ధం అవుతుంది. వరుడి వేటలో కుటుంబ సభ్యులున్నారు లాంటి పసలేని ప్రచారాలెన్నో జరిగాయి. వీటిలో ఏ ఒక్క ప్రచారానికీ కాజల్ స్పందించలేదు. కాలమే సమాధానం చెబుతుందన్న విశ్వాసం కావచ్చు. సరిగ్గా అలాంటి సమయమే ఆసన్నమైంది. ఈ ముద్దుగుమ్మ రెండు కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల క్లబ్‌లో చేరబోతోంది. ఈ బ్యూటీకి రెండు కోట్లు పారితోషికం చెల్లించడానికి దర్శక, నిర్మాత లింగుస్వామి సమ్మతించినట్లు తాజా సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ హీరోగా ఈయన నిర్మించనున్న ఉత్తమ విలన్ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటించనున్నారు. 
 
 ఈ పాత్ర కోసం ముందు అనుష్క పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆమె రెండు భారీ చిత్రాల్లో బిజీగా ఉండటంతో కాల్‌షీట్స్ కేటాయించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం కాజల్‌ను వరించింది. ఈ భామ తాను యువ హీరోల సరసన మాత్రమే నటిస్తానని బెట్టు చేయడంతో నిర్మాత రెండు కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట. అంత పారితోషికం ఇస్తానంటే ఏ హీరోయిన్ మాత్రం కాదనజాలదు. కాజల్ కూడా ఓకే అంటూ తలాడించేసిందట. కాజల్, విజయ్‌తో జతకట్టిన తాజా చిత్రం జిల్లా సంక్రాంతి రేసుకు సిద్ధం అవుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement