షూటింగ్‌లో కమలహాసన్‌కు గాయాలు | Kamal Haasan injures leg during Uttama Villain shoot | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో కమలహాసన్‌కు గాయాలు

Published Mon, Jul 7 2014 11:46 PM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

షూటింగ్‌లో కమలహాసన్‌కు గాయాలు - Sakshi

షూటింగ్‌లో కమలహాసన్‌కు గాయాలు

 ప్రముఖ నటుడు కమలహాసన్ షూటింగ్‌లో ప్రమదం కారణంగా గాయాలకు గురయ్యారు. దీంతో ఉత్తమ విలన్ షూటింగ్ రద్దయిం ది. కమలహాసన్ తాజాగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమవిలన్ చిత్రా న్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం చిత్రంలో కమలహాసన్ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమా దం జరిగి ఆయన కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో షూటింగ్ రద్దు అయినట్లు దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. కమల్‌కు పూర్తిగా ఆర్యోగం చేకూరిన తరువాత ఉత్తమ విలన్ షూటింగ్ చేస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement