హాలీవుడ్‌లో ఉత్తమ విలన్‌! | uttama villain turn to hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో ఉత్తమ విలన్‌!

Published Mon, May 8 2017 11:41 PM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

హాలీవుడ్‌లో ఉత్తమ విలన్‌! - Sakshi

హాలీవుడ్‌లో ఉత్తమ విలన్‌!

టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. శాండల్‌వుడ్‌.. మాలీవుడ్‌.. బాలీవుడ్‌... ఈ అన్ని వుడ్‌ల వారు హాలీవుడ్‌ చిత్రాలు చూసి, ఇన్‌స్పైర్‌ అవుతుంటారు. కొందరు దర్శకులు అప్పుడప్పుడు ఆ సినిమాల్లోని సీన్స్‌ని ఆదర్శంగా చేసుకుని, తీస్తుంటారు కూడా. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయినట్లనిపిస్తోంది. మన ఇండియన్‌ సినిమాని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఓ హాలీవుడ్‌ చిత్రం రూపొందించారట. సినిమా పేరు ‘ది హీరో’.  బ్రెట్‌ హాలే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఉత్తమ విలన్‌’లా ఉందట.

టాలీవుడ్, కోలీవుడ్‌లో రెండేళ్ల కిందట విడుదలైన కమల్‌ హాసన్‌ ‘ఉత్తమ విలన్‌’ గుర్తుండే ఉంటుంది. కమల్‌ స్వయంగా కథ అందించి, నటించిన  ఈ చిత్రానికి రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టేకింగ్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ ఏడాది జనవరి 21న ‘ది హీరో’ చిత్రాన్ని ‘సన్‌ డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించారు. ఈ సినిమాలో మన ‘ఉత్తమ విలన్‌’ షేడ్స్‌ ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. జూన్‌ 9న సినిమా విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement