హాలీవుడ్ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్న కమల్ | Kamal's Hollywood project titled 'All are Kin' | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్న కమల్

Published Thu, Feb 11 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

హాలీవుడ్ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్న కమల్

హాలీవుడ్ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్న కమల్

నటుడు కమలహాసన్‌కు సినిమాలో తెలియని విద్య లేదు అనడం అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని సకలకళావల్లభుడు అని ఎప్పుడో కీర్తించారు. ఇప్పుడు విశ్వనటుడిగా పేరుతెచ్చుకున్న కమలహాసన్ త్వరలో ఆంగ్ల చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించనున్నారు.ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. పాపనాశం,తూంగావనం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కమల్ మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
 
  ఆయన కూతురు శ్రుతిహాసన్ నటించడం లాంటి పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం అంటూ త్రిభాషా చిత్రంగా తెరకెక్కనుందన్నది సమాచారం. ఇటీవల హార్వర్డ్ వర్సిటీలో ప్రసంగించడానికి అమెరికా వెళ్లిన విశ్వనటుడు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఒక ఆగ్ల చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు.
 
  ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కమల్ ఇంకా మాట్లాడుతూ సెన్సార్ బృందంపై విమర్శలు ఓ పక్క,సెన్సార్‌కు వ్యతిరేకంగా మరో పక్క పోరాటాలు జరుగుతున్నాయన్నారు. అసలు సెన్సార్ అవసరం లేదన్నది తన అభిప్రాయం అని దాన్ని ధ్రువపత్రం అంటే సరిపోతుందని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ మధ్య చిత్ర పరిశ్రమలో నల్లధనం ఒక ప్రవాహంలా వచ్చి చేరేతోందన్నారు. ఇది ఆరోగ్యకరమైన విషయం కాదని కమలహాసన్ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement