హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా | hollywood film the hero is based on uttama villain story | Sakshi
Sakshi News home page

హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా

Published Fri, May 5 2017 10:22 AM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా - Sakshi

హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రెండేళ్ల కిందట తెరకెక్కిన సినిమా ఉత్తమ విలన్, కమల్ సన్నిహితుడు, ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా ఆకట్టుకోలేకపోయినా.. కమల్ నటనకు మరోసారి ప్రశంసలు దక్కాయి. ఎప్పుడో సౌత్ ప్రేక్షకులు మర్చిపోయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తమ విలన్ సినిమా కథ ఆధారంగా హాలీవుడ్లో 'ది హీరో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారట.

త్వరలోనే తాను చనిపోతానని తెలిసిన ఓ సూపర్ స్టార్ ఆఖరి రోజుల్లో ఏం చేశాడన్న కథతో ఉత్తమ విలన్ సినిమా తెరకెక్కింది, ఇది పాయింట్ను తీసుకొని హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ హాలే 'ది హీరో' చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ కమల్ పేరు కనిపించనుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్లో సత్తా చాటిన 'ది హీరో' జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా నిజంగా ఉత్తమ విలన్కు అఫీషియల్ రీమేకా.. లేక ఫ్రీ మేకా తెలియాంలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement