the hero
-
హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రెండేళ్ల కిందట తెరకెక్కిన సినిమా ఉత్తమ విలన్, కమల్ సన్నిహితుడు, ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోయినా.. కమల్ నటనకు మరోసారి ప్రశంసలు దక్కాయి. ఎప్పుడో సౌత్ ప్రేక్షకులు మర్చిపోయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తమ విలన్ సినిమా కథ ఆధారంగా హాలీవుడ్లో 'ది హీరో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే తాను చనిపోతానని తెలిసిన ఓ సూపర్ స్టార్ ఆఖరి రోజుల్లో ఏం చేశాడన్న కథతో ఉత్తమ విలన్ సినిమా తెరకెక్కింది, ఇది పాయింట్‌ను తీసుకొని హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ హాలే 'ది హీరో' చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ కమల్ పేరు కనిపించనుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో సత్తా చాటిన 'ది హీరో' జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా నిజంగా ఉత్తమ విలన్‌కు అఫీషియల్ రీమేకా.. లేక ఫ్రీ మేకా తెలియాంలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
గుర్తుకొస్తున్నాయి...
చిత్రం ఫోటోలను ఎంత లేటుగా చూస్తే అంత బాగుంటాయి. పాతవే కొత్త అందాలతో కనిపిస్తాయి. ‘ఫిలింఫేర్’ పత్రిక తన పాత ఫోటోల కోసం ఏకంగా ’60లలోకి, ’70లలోకి వెళ్లింది. ఆరోజుల్లో...‘ఉత్తమ నటి’ ‘ఉత్తమ హీరో’ కేటగిరిలో ‘ఫిలింఫేర్’ అవార్డ్లు గెలుచుకున్న నటీనటుల ముఖచిత్రాలను మళ్లీ ఒకసారి ప్రచురించింది. మచ్చుకు రెండు చూడండి. ఎంత బాగున్నాయో కదా! -
ప్రాదేశికపోరులో నేడే తొలి సమరం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ప్రాదేశిక పోరులో భాగంగా తొలి సమరం ఆదివారం జరగనుంది. జిల్లాలోని 24 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం 24 మండలాల్లో 1,149 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురికాకుండా జెడ్పీటీసీకి తెల్లరంగు, ఎంపీటీసీకి గులాబీరంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఇప్పటికే నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 24 జెడ్పీటీసీ స్థానాలకుగాను 129 మంది అభ్యర్థులు, 349 ఎంపీటీసీ స్థానాలకుగాను 1,339 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో మొత్తం 8,85,107 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం 5,745 మంది విధులు నిర్వహించనున్నారు. 128 మంది జోనల్, 128 రూట్ ఆఫీసర్లు, 1,149 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,149 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 3,447 మంది పోలింగ్ ఆఫీసర్లు ఎన్నికల్లో నిర్వహణలో పాల్గొంటున్నారు. వీరంతా శనివారం రాత్రి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సహా చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సరళిని 104 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. 340 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వీడియోగ్రఫీ, వెబ్లైవ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే తొలి విడతగా 24 మండల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి, కొండాపూర్, కల్హేర్, మనూరు, కంగ్టి, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మునిపల్లి, రాయికోడ్, సదాశివపేట, కొల్చారం, అల్లాదుర్గం, నర్సాపూర్, అందోలు, మెదక్, కొండపాక, జగదేవ్‌పూర్, దుబ్బాక, నంగునూరు, మిరుదొడ్డి, చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. -
స్వలింగ సంపర్కులూ మనుషులే
హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: ‘అభివృద్ధి పథంలో ఎంత దూసుకుపోతున్నా సమాజంలో ఇంకా కొన్ని వర్గాలు, ప్రజలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. స్వలింగ సంపర్కులూ మనుషులే. అందరిలా వారికీ హక్కులుంటాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల అన్నారు. హైదర్‌గూడ సెంట్రల్ పార్క్ హోటల్లో అలయన్స్ స్వచ్ఛంద సంస్థ, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుల ఆధ్వర్యంలో ఆర్టికల్ 377కు వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. స్వలింగ సంపర్కుల హక్కులు కాలరాసేలా ఉన్న ఆర్టికల్ 377ను తొలగించేందుకు అన్ని పార్టీలూ కృషిచేయాలని అమల డిమాండ్ చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి చిరంజీవులుచౌదరి మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ హక్కుల కోసం పోరాడే పార్టీలకే ఓటు వేస్తామని అలయన్స్ ప్రతినిధులు శ్యామల, ఆర్తి చెప్పారు. డాక్టర్ శుభకర్ తదితరులు పాల్గొన్నారు.