స్వలింగ సంపర్కులూ మనుషులే | Gay men | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కులూ మనుషులే

Published Thu, Mar 27 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

స్వలింగ సంపర్కులూ మనుషులే

స్వలింగ సంపర్కులూ మనుషులే

హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: ‘అభివృద్ధి పథంలో ఎంత దూసుకుపోతున్నా సమాజంలో ఇంకా కొన్ని వర్గాలు, ప్రజలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. స్వలింగ సంపర్కులూ మనుషులే. అందరిలా వారికీ హక్కులుంటాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల అన్నారు.

హైదర్‌గూడ సెంట్రల్ పార్క్ హోటల్లో అలయన్స్ స్వచ్ఛంద సంస్థ, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుల ఆధ్వర్యంలో ఆర్టికల్ 377కు వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. స్వలింగ సంపర్కుల హక్కులు కాలరాసేలా ఉన్న ఆర్టికల్ 377ను తొలగించేందుకు అన్ని పార్టీలూ కృషిచేయాలని అమల డిమాండ్ చేశారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి చిరంజీవులుచౌదరి మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ హక్కుల కోసం పోరాడే పార్టీలకే ఓటు వేస్తామని అలయన్స్ ప్రతినిధులు శ్యామల, ఆర్తి చెప్పారు. డాక్టర్ శుభకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement