homosexuals
-
39 మందికి బైడెన్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో బైడెన్ క్షమాభిక్ష, శిక్షాకాలం తగ్గింపుల జోరు పెంచారు. అమెరికా చరిత్రలో ఎన్నడూలేనంతగా ఒకేసారి ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. మాదకద్రవ్యాల వినియోగం, స్వలింగ సంపర్కులు తదితర నేరాలుచేసిన వాళ్లు వీరిలో ఉన్నారు. హింసాత్మకంకాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు బైడెన్ ఏకంగా క్షమాభిక్ష ప్రసాదించారు. ఆధునిక అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోవిడ్ సంక్షోభకాలంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్‌బారిన పడి మృతిచెందడం కంటే విడిగా దూరం దూరంగా ఉంటే మంచిదని భావించి ఆనాడు చాలా మందిని బైడెన్ సర్కార్ విడిచిపెట్టింది. అలా స్వస్థలాలకు వెళ్లిన ఖైదీలను కొని నెలలపాటు గృహనిర్బంధంలో ఉంచింది. గురువారం వీళ్లంతా శిక్షాకాలం తగ్గింపు ఉపశమనం పొందారు. -
LGBTQ కమ్యూనిటీకి కలిసి జీవించే హక్కు ఉంది : సుప్రీం
-
స్వలింగ సంపర్కురాలి నుంచి కుమార్తెను రక్షించండి
సాక్షి, చెన్నై(తమిళనాడు): స్నేహం పేరుతో తన కుమార్తెను స్వలింగ సంపర్కానికి ప్రేరేపిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని చెన్నై తిరుమంగళం పోలీసుస్టేషన్లో ఓ యువతి తండ్రి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మదురై జిల్లాకు చెందిన ఆనంద్ (44) చెన్నైలో ఇతని కుమార్తె తన బంధువు ఇంటిలో బస చేసి వుంది. అదే ప్రాంతానికి చెందిన మరో యువతితో స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఆమెను రక్షించాలని కోరుతూ మంగళవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో తన కుమార్తె(17) చదువు సరిగా రాలేదని దీంతో చెన్నై సైదాపేటలోని బంధువుల ఇంటిలో ఉంచినట్లు తెలిపారు. అక్కడ ఆమె గత కొన్ని నెలలుగా నుంగంబాక్కంలోని ఒక ప్రైవేటు శిక్షణ కేంద్రంలో దుస్తుల తయారీ నేర్చుకుంటోందన్నారు. ఈ సమయంలో అక్కడున్న మరో యువతితో తన కుమార్తెకు స్వలింగ సంపర్క సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. దీంతో ఆమె గత కొన్ని రోజుల క్రితం సైదాపేట బంధువుల ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. ఆమె కోసం గాలిస్తున్న స్థితిలో అన్నానగర్ వెస్ట్ ప్రాంతంలోని ఒక సంస్థలో కౌన్సెలింగ్ పొందుతున్నట్లు తాజాగా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం ఆ సంస్థతో తన కుమార్తెను పంపాలని కోరినా వారు నిరాకరించారన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకొని తన కుమార్తెను రక్షించాలని కోరారు. తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి బాలికతో సంబంధమున్న మరో యువతిని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
ఆ ఆరుగురు..
పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్మ్రక తీర్పు వెనుక ఆరుగురి కృషి ఉంది. సెక్షన్ 377ని నాజ్ ఫౌండేషన్ ప్రధానంగా సవాల్ చేసినప్పటికీ ఒక డ్యాన్సర్, ఒక జర్నలిస్టు, ఒక చెఫ్, ఒక హోటల్ యజమాని, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోరాటంతో దేశంలో గే చట్టాల్లో సమూల మార్పులు వచ్చాయి. గే హక్కుల కోసం పోరాడుతూ ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీకి చెందిన ఆ ఆరుగురు ఎవరంటే... నవతేజ్ సింగ్ జౌహర్ నవతేజ్ జౌహర్ భరతనాట్యం డ్యాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా. ఢిల్లీ, చెన్నైలలో ఆయన నృత్యపాఠశాలల్ని నడుపుతున్నారు. నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. తన సహచరుడు, జర్నలిస్టు సునీల్ మెహ్రా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ మెహ్రా ప్రముఖ జర్నలిస్టు, మాగ్జిమ్ మ్యాగజైన్ మాజీ సంపాదకులు. టెలివిజన్ ప్రొడక్షన్స్లలో కూడా పని చేశారు. 20 ఏళ్లకు పైగా నవతేజ్ జౌహర్తో ఆయనకు అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి స్టూడియో అభ్యాస్‌ని నడిపారు. మొదట్లో న్యాయపోరాటం చేయాలని సునీల్ గట్టిగా అనుకోలేదు. కానీ ఆయన స్నేహితురాలు, లాయర్ అయిన మేనక గురుస్వామి గే హక్కుల కోసం న్యాయస్థానంలోనే పోరాటం చేయాలని చెప్పడంతో పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకొచ్చారు. రీతూ దాల్మాయి ప్రముఖ చెఫ్. ఢిల్లీలో ఒక ఇటలియన్ రెస్టారెంట్ దివాని ఆమె నడుపుతున్నారు. ఇండియన్ టీవీలో కుకరీ షోని హోస్ట్ చేస్తున్నారు. కోల్‌కతాలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన రీతూ పదహారేళ్ల వయసులోనే మార్బుల్ బిజినెస్ చేశారు. ఆతర్వాత ఒక చెఫ్‌గా పేరు తెచ్చుకున్నారు. అమన్ నాథ్ 67 ఏళ్ల వయసున్న అమన్ నాథ్ ప్రముఖ రచయిత, ఆర్కిటెక్టర్. హెరిటేజ్ హోటల్స్ నీమ్రానా గ్రూపు వ్యవస్థాపకుడు తన భాగస్వామి ఫ్రాన్సిస్‌తో కలిసి అత్యంత పురాతనమైన భవనాలను హోటల్స్‌గా మార్చారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే ఆయన ఆశయంగా ఉండేది. ఆ తర్వాత గే హక్కుల కోసం పోరాటం చేశారు. కేశవ్ సూరి 33 ఏళ్ల వయసున్న కేశవ్సూరి లలిత్ సూరి హాస్పటాలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . భరత్ హోటల్స్ వ్యవస్థాపకుడు లలిత్ సూరి కుమారుడు. కేశవ్సూరి బహిరంగంగానే తాను గే అని చెప్పుకున్నారు. ఇటీవల తన జీవిత భాగస్వామి అయిన మరో పురుషుడిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయేషా కపూర్ అయేషా ఇప్పడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త. ఇకామర్స్ మార్కెట్లో తన సత్తా చాటుతున్నారు. -
నేను ‘గే’ అని అమ్మ అన్నం పెట్టడంలేదు
సాక్షి,హైదరాబాద్ : సమాజంలో తమను కూడా మనుషులుగా గుర్తించాలని తమ హక్కులను కూడా కాపాడాలని పలువురు స్వలింగ సంపర్కులు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఏడాది జూన్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుంటారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు, గే లు, బై సెక్సువల్(ఎల్జీబీటీ) సమావేశమయ్యారు. ప్రైడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఎల్జీబీటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ హక్కులను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తమ కుటుంబంలోనే తమను వెలివేస్తున్నారంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించాడు. తాను ‘గే’ నని తెలుసుకొని తన తల్లి వారం రోజులు అన్నం పెట్టకుండా మాడ్చారని, ఓ రూమ్‌లో వేసి బంధించారని ఇదెక్కడి అన్యాయమని ఇంకో యువకుడు ఆందోళన చెందాడు. తనలో వచ్చిన మార్పులను గమనించి తన తండ్రి తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడని, ఏం పాపం చేశానని తాను ఇప్పుడు రోడ్డునపడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలపై గొంతు విప్పారు. తమకు కూడా గుర్తింపు కావాలని వీరంతా డిమాండ్ చేశారు. -
‘స్వలింగ’ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్ధత
సిడ్నీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును ఇంతకుముందు పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43–12 మెజారిటీతో ఆమోదించగా.. గురువారం కాన్బెర్రాలో సమావేశమైన ప్రతినిధుల సభ (దిగువ సభ) 146–4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందగానే సభ్యులు ఆనందంతో చప్పట్లు కొడుతూ, పరస్పరం ఆలింగనాలతో హర్షం వ్యక్తం చేశారు. తొలి నుంచి స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతు ఇస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మాట్లాడుతూ..‘సమానత్వానికి, గౌరవానికి, ప్రేమకు ఇది అద్భుతమైన రోజు. ఆస్ట్రేలియా ఎట్టకేలకు సాధించింది’ అని ప్రకటించారు. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేయవచ్చు. నోటీస్ దాఖలు చేసిన 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత షార్టెన్ స్వాగతించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల సరసన ఆస్ట్రేలియా చేరింది. -
హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు
- ప్రపంచంలోనే తొలిసారి ప్రారంభించిన చెచెన్యా రిపబ్లిక్ - దారుణ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న వ్యతిరేకత గ్రోజ్నీ: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను హింసించేందుకు జర్మన్ నియంత హిట్లర్ ప్రత్యేకంగా ఏర్పాటుచేయించిన కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి చాలానే చదివాం. 'కాన్సంట్రేషన్ క్యాంపులో ఉండటంకంటే చచ్చి నరకానికి వెళ్లడమే నయం' అనుకునేంత స్థాయిలో క్రూరహింసలు అమలయ్యేవక్కడ! సరిగ్గా అలాంటి క్యాంపులనే, స్వలింగ సంపర్కుల(హోమోసెక్సువల్స్)ను శిక్షించేందుకు ప్రారంభించింది చెచెన్యా సర్కారు. అధికారిక ఉత్తర్వులతో మంగళవారం ప్రారంభమైన ఈతరహా కాన్సంట్రేషన్ క్యాంపుల ఏర్పాటు ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతోన్న స్వలింగసంపర్కులను నిరోధించేందుకు, వారిని సంస్కరించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అర్గూన్ సహా పలు నగరాల్లో ఈ క్యాంపులు ఏర్పాటయ్యాయి. గతవారం దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 100 మంది స్వలింగ సంపర్కులు పట్టుబడ్డారు. వారిలో పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం. అలా పట్టుబడిన స్వలింగ సంపర్కులను కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించి తీవ్రంగా హింసిస్తున్నారని, కరెంట్ షాకులు ఇచ్చి చంపేస్తున్నారని ఎల్.జి.బి.టి హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. 'ఈ దేశంలో హోమోసెక్సువల్స్ ఉండటానికి వీల్లేదని, అలవాట్లు మార్చుకోనివారు దేశం విడిచి వెళ్లాలని పోలీసులు బెదిరిస్తున్నారు'అని ఓ కార్యకర్త ఆరోపించాడు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్,గే,బైసెక్సువల్,ట్రాన్స్ జెండర్(ఎల్.జి.బి.టి) హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వలింగ సంపర్కం అంశం చుట్టూ తిరిగే 'మూన్ లైట్' సినిమా ఈ ఏటి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలవడం ఎల్.జి.బి.టి హక్కుల పోరాటానికి మరింత ఊపునిచ్చినట్లయింది. ఈ తరుణంలోనే చెచెన్యా రిపబ్లిక్ తీసుకున్న తీవ్రనిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతానికి రష్యాలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ఇస్లాం సంప్రదాయాలు అధికంగా పాటించే చెచెన్యా ప్రాంతం.. చెచెన్యా రిపబ్లిక్ పేరుతో ప్రత్యేక గుర్తింపు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
పెద్దలను‘గే’లి చేశాడు
అనేక మంది పేర్లతో ఫేస్బుక్ ప్రొఫైల్స్ వారు స్వలింగ సంపర్కులంటూ ప్రచారం ఎట్టకేలకు వైద్యుడి ఫిర్యాదుతో కటకటాల్లోకి హైదరాబాద్ : నగరానికి చెందిన గౌరవప్రదమైన వ్యక్తులతో సహా అనేక మందిని కొన్ని నెలలుగా అలా‘గే’ వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ సెల్ అధికారులు పట్టుకున్నారు. పలువురు ప్రముఖుల ఫొటోలను వినియోగించి ఫేస్బుక్లో బోగస్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడంతో పాటు వారంతా స్వలింగ సంపర్కులంటూ ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వెల్లడించారు. బాచుపల్లికి చెందిన తుమ్మల సురేష్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ లీడ్‌గా పని చేస్తున్నాడు. కొన్న్ళ్లా క్రితం ఇతడి వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఫేస్‌బుక్‌ను విరివిగా బ్రౌజ్ చేసే సురేష్ అందులో ఉన్న అనేక మంది ఫొటోలను డౌన్లోడ్ చేసి వాటిని వినియోగిస్తూ వారి పేర్లతోనే ప్రొఫైల్స్ క్రియేట్ చేసే వాడు. అందులో తాము స్వలింగ సంపర్కులమని, ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ పోస్టులు పెట్టడంతో పాటు వారి ఫోన్ నెంబర్లనే పోస్ట్ చేసే వాడు. దీంతో అనేక మంది నుంచి బాధితులకు ఫోన్‌కాల్స్ వెళ్ళేవి. అంతేగాకుండా పలువురికి ఫోన్లు చేసిన సురేష్ తాను స్వలింగ సంపర్కుడినని, తనతో స్నేహం చేసే ఆసక్తి ఉందా? అని అడుగుతూ ఇబ్బందులు పెట్టేవాడు. ఇప్పటి వరకు అనేక మంది ఇతడి బారినపడినా... పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సురేష్ ఇటీవల నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడి (సర్జన్) పేరుతో ఫేస్బుక్లో బోగస్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఇందులోనూ ‘అలాంటి’ పోస్టు పెట్టడంతో పాటు కొన్ని స్వలింగ సంపర్కులకు చెందిన వెబ్సైట్ అడ్రస్‌లు పోస్ట్ చేయడంతో సదరు వైద్యుడి బతుకు దుర్భరమైపోరుుంది. ప్రతి రోజూ 40 నుంచి 50 మంది అపరిచితుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యారుు. ఫలితంగా తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన వైద్యుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సైబర్ సెల్ అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి సురేష్‌ను నిందితుడిగా గుర్తించారు. ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
వాళ్ల కోసం మ్యారేజ్ బ్యూరో
అహ్మదాబాద్: స్వలింగ సంపర్కుల కోసం భారత్ లో తొలిసారిగా మ్యారేజ్ బ్యూరో అందుబాటులోకి రానుంది. భారతీయ హోమోసెక్సువల్స్ కోసం అరేంజ్ గే మ్యారేజ్ డాట్ కామ్ పేరుతో మ్యారేజ్ బ్యూరో ప్రారంభించనున్నట్టు అమెరికాలో స్థిరపడిన ఎన్నారై బెనహర్ శామ్సన్ ప్రకటించారు. మెడికల్ టూరిజంలో పనిచేస్తున్న శామ్సన్.. సరోగసీ ద్వారా గే దంపతులు పిల్లలు పొందేందుకు సేవలు అందిస్తున్నారు. స్వలింగ సంపర్కులు తమ జీవిత భాగస్వాములను వెతుక్కునేందుకు మ్యారేజ్ బ్యూరో ప్రారంభిస్తున్నట్టు శామ్సన్ తెలిపారు. తన క్లైంట్ల నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 'జూన్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వివాహ సమానత్వ హక్కులు ప్రకటించారు. తమ జీవిత భాగస్వాములను వెతుక్కునేందుకు హోమోసెక్సువల్స్ పెద్ద సంఖ్యలో ఇండియాకు వస్తున్నారు. ఇలాంటి వారికి మనమే భాగస్వాములను ఎందుకు వెతికిపెట్టకూడదన్న ఆలోచన వచ్చింద'ని హైదరాబాద్ నుంచి ఫోన్లో పీటీఐతో చెప్పారు. డేటింగ్ వెబ్ సైట్లతో పోలిస్తే తమ మ్యారేజ్ బ్యూరో విభిన్నంగా ఉంటుందని తెలిపారు. సంబంధాల కోసం ఇప్పటికే 250 మంది తమను సంప్రదించారని, వీరిలో ఎక్కువ మంది భారతీయులున్నారని వెల్లడించారు. తమ పోర్టల్ ద్వారా 19 మంది స్వలింగ సంపర్కులకు వివాహాలు జరిపించామని తెలిపారు. దేశంలో 12 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని 2012లో సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన చూస్తే గే మ్యారేజ్ బ్యూరోకు గిరాకీ బాగానే ఉండొచ్చు. -
స్వలింగ సంపర్కుల పెళ్లికి ఓకే..
డబ్లిన్: ఇకపై స్వలింగ సంపర్కులు ఐర్లాండ్‌లో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అందరిలాగే జీవితం గడపవచ్చు. ఆ మేరకు ‘వివాహ బిల్లు 2015’లో మార్పులు చేస్తూ శుక్రవారం అధ్యక్ష కమిషన్ చట్టం తీసుకొచ్చింది. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 62.1 శాతం ప్రజలు గేలకు మద్దతు ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు. గేలకు మద్దతుగా చట్టం తీసుకొచ్చిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. రానున్న నెల రోజుల్లో ఈ తరహా వివాహాలను కొన్నైనా జరిపించాలని కూడా నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. -
స్వలింగ సంపర్కులూ మనుషులే
హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: ‘అభివృద్ధి పథంలో ఎంత దూసుకుపోతున్నా సమాజంలో ఇంకా కొన్ని వర్గాలు, ప్రజలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. స్వలింగ సంపర్కులూ మనుషులే. అందరిలా వారికీ హక్కులుంటాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల అన్నారు. హైదర్‌గూడ సెంట్రల్ పార్క్ హోటల్లో అలయన్స్ స్వచ్ఛంద సంస్థ, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుల ఆధ్వర్యంలో ఆర్టికల్ 377కు వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. స్వలింగ సంపర్కుల హక్కులు కాలరాసేలా ఉన్న ఆర్టికల్ 377ను తొలగించేందుకు అన్ని పార్టీలూ కృషిచేయాలని అమల డిమాండ్ చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి చిరంజీవులుచౌదరి మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ హక్కుల కోసం పోరాడే పార్టీలకే ఓటు వేస్తామని అలయన్స్ ప్రతినిధులు శ్యామల, ఆర్తి చెప్పారు. డాక్టర్ శుభకర్ తదితరులు పాల్గొన్నారు.