ఏ హీరో ఇలా చేయలేదు! | Good opening Uthama villan Movie sasy C.Kalyan | Sakshi
Sakshi News home page

ఏ హీరో ఇలా చేయలేదు!

Published Sun, May 3 2015 11:30 PM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

ఏ హీరో ఇలా చేయలేదు! - Sakshi

ఏ హీరో ఇలా చేయలేదు!

 ‘‘మే 1న విడుదల కావాల్సిన చిత్రం ఇది. కానీ, అది జరగలేదు. విడుదలకు ముందు మూడు రోజుల పాటు పోరాడాం. చివరికి శనివారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగాం’’అని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. కమల్‌హాసన్ హీరోగా రమేశ్ అరవింద్ దర్శక త్వం వహించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘విడుదలలో జాప్యం జరిగినా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఏ  సినిమాలోనూ ఏ హీరో చేయని కేరెక్టర్ చేసి కమల్ ప్రేక్షకులను మెప్పించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుమార్‌బాబు, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement