త్రిపాత్రాభినయంలో సోదరులు | Surya And Trivikram Movie Finalized! | Sakshi
Sakshi News home page

త్రిపాత్రాభినయంలో సోదరులు

Published Sat, Jan 30 2016 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

త్రిపాత్రాభినయంలో సోదరులు

త్రిపాత్రాభినయంలో సోదరులు

ఒకే కుటుంబంలో సోదరులిద్దరూ ప్రముఖ కథానాయకులుగా రాణించడమే అరుదైన విషయం. ఇక ఈ సోదర ద్వయం ఏక కాలంలో త్రిపాత్రాభినయం చేయడం నిజంగా విశేషమే. యాదృచ్చికమే అయినా నటుడు సూర్య, కార్తీలు తాము నటిస్తున్న తాజా చిత్రాలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాల సంగతేమిటో చూద్దాం. నటుడు సూర్య నటిస్తున్న చిత్రం 24. మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య సొంతంగా తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్ ఇటీవలే విడుదలై పెద్ద హైప్‌నే క్రియేట్ చేసింది. కాగా ఇందులో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

ఈ విషయం గురించి సూర్య తెలుపుతూ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు. అసలు ద్విపాత్రాభినయమే వద్దనుకున్న తనను మాస్ చిత్రం అటువైపు లాగిందన్నారు. ఇక తాజా చిత్రం 24 విషయానికి వస్తే ద్విపాత్రాభినయం కంటే ఎక్కువ పాత్రలు చేయాలన్నది దర్శకుడు విక్రమ్‌కుమార్ కథ డిమాండ్ మేరకే జరిగిందని పేర్కొన్నారు. ఇక ఆయన సోదరుడు కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా విషయానికి వస్తే ఇందులో ఆయన సరసన నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్నది గమనార్హం. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఇది ఒక ఆత్మ ఇతివృత్తంతో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. చాలా ట్విస్ట్‌లు, మలుపులతో కూడిన ఈ చిత్రంలో ఒక చారిత్రక అంశం కూడా చోటు చేసుకుంటుందన్నారు. ఈ కారణాలే ఇందులో తనను ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించడానికి దోహదం చేశాయని కార్తీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement