హాట్ టాపిక్‌గా సమంత స్టిల్స్ | Samantha Hot Pose in Anjaan | Sakshi
Sakshi News home page

హాట్ టాపిక్‌గా సమంత స్టిల్స్

Published Sat, May 3 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

హాట్ టాపిక్‌గా సమంత  స్టిల్స్

హాట్ టాపిక్‌గా సమంత స్టిల్స్

కోలీవుడ్‌లో ఇప్పుడు సమంతదే హాట్ టాపిక్. లింగుస్వామి దర్శకత్వంలో సూర్యకు జోడీగా ఆమె నటించిన ‘ఆంజానే’ సినిమా స్టిల్స్‌ని ఇటీవలే మీడియాకు విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో సమంత మాస్ అప్పీల్ చూసి తమిళ తంబీలు ఫిదా అయిపోతున్నారట. చిన్ని నిక్కర్ వేసుకొని, షర్ట్‌కి ఉన్న ఒక్క బటన్ మినహా మిగిలిన అన్ని బటన్స్‌నీ తీసేసి ఉన్న సమంత స్టిల్స్ తమిళనాట ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

తెలుగులో ఇప్పటికే నంబర్‌వన్ పొజిషన్‌ని ఎంజాయ్ చేస్తున్న సమంత... కోలీవుడ్‌లో కూడా ఆ ప్లేస్ కోసం ఉవ్విళ్లూరుతోందని, ఎలాగైనా హన్సికను వెనక్కి లాగడమే తన ధ్యేయంగా కనిపిస్తోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై ఇటీవల సమంత స్పందిస్తూ- ‘‘కథానుగుణంగా ‘ఆంజానే’లో నా పాత్ర మాస్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టే నా గెటప్‌ని డిజైన్ చేశారు లింగుస్వామి. ఈ సినిమా కచ్చితంగా తమిళనాట నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికి కూడా నేను రెడీ. పరిశ్రమలో నేను ఎవర్నీ పోటీగా భావించను. ఇక్కడ ఎవరి అవకాశాలు వారివి’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement