సూర్యతో కరీనా కపూర్
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఈ ఏడాది కోలీవుడ్ తెరపై మెరవనున్నారు. అది కూడా ఒక ప్రత్యేక నృత్య గీతం ద్వారా. గతంలో కరీనాకి పలు తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించే అవకాశం వచ్చినా, ఆమె అంగీకరించలేదు. చివరకు ప్రత్యేక గీతానికి పచ్చజెండా ఊపడం విశేషం. సూర్య హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అంజాన్’లోనే ఆమె ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే బాలీవుడ్ భామ చిత్రాంగదా సింగ్‌తో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరించారు. ఇందులో ఉన్న మరో ఐటమ్ సాంగ్‌కి కరీనా కపూర్‌ని అడిగారట.
హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ పాటకు కాలు కదపడానికి ఆమె అంగీకరించారు. అయితే, ఇంకా డేట్స్ కేటాయించలేదు. కరీనా పని ఒత్తిడి దృష్ట్యా ఆమెకు ఇబ్బంది కలగకుండా ముంబయ్‌లోనే ఈ పాటను చిత్రీరించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా పాటలు స్వరపరిచారు. సూర్య, కరీనాలపై చిత్రీకరించనున్న పాటకు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఇది మంచి మాస్ మసాలా పాట అని సమాచారం. మాస్, క్లాస్ స్టెప్స్‌ని అద్భుతంగా చేయగల కరీనా ఈ పాటలో విజృంభిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.