item number
-
'ఐటమ్ నంబర్ అని పిలవకండి'
సినిమాల్లో డ్యాన్సులను 'ఐటమ్ నంబర్' అని పిలవకండి అంటూ మండిపడుతోంది అందాలతార అదితి రావ్. 'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' లో తను చేస్తున్న పాట గురించి విలేకరులు ప్రశ్నించగా అమ్మడు అంతెత్తున విరుచుకుపడింది. 'నేను దాన్ని ఐటమ్ నెంబర్ అని అనుకోను. అయినా 2016లో కూడా ఎవరైనా అలా అంటారని నేననుకోను. ఇంకా ప్రత్యేక డ్యాన్సులను ఐటమ్ నంబర్ అని అంటున్నారంటే అది నిజంగా బాధాకరం. ఐటమ్ సాంగ్ అంటున్నారంటే ఆ పాటలో డ్యాన్స్ చేసే అమ్మాయిని ఐటమ్ గా వర్ణిస్తున్నట్టేగా' అంటూ ప్రశ్నించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే ఆమెను డ్యాన్సర్ అని అనాలి గానీ, ఐటమ్ అని అనరు కదా. ఏదైనా మన ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందంటూ చురకలంటించింది. రెండేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సిన 'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' ఎట్టకేలకు వచ్చేవారం విడుదలకు సిద్ధమైంది. సినిమా అందరికీ నచ్చుతుందంటూ అదితి ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఆమె మణిరత్నం తదుపరి చిత్రం ‘కాట్రు వెళియిడై’లో కార్తీ సరసన నటిస్తోంది. -
స్పెషల్ సాంగ్ లో తమన్నా
2011లో రిలీజ్ అయిన ఊసరవెల్లి సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్, తమన్నాలు మరోసారి తెరను పంచుకుంటున్నారు. అయితే ఈ సారి ఫుల్ సినిమాలో ఈ జోడి జంటగా నటించటం లేదట. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమాలో.. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇప్పటికే అల్లుడు శీను సినిమా కోసం ఐటమ్ నెంబర్ చేసిన తమన్నా ఎన్టీఆర్ కోసం మరోసారి అదే పని చేస్తోంది. కెరీర్ కష్టాల్లో పడిందనుకున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా అవుతోంది. బాహుబలి 2 సినిమాలో బిజీగా ఉన్న తమన్నా, నాగార్జున్, కార్తీ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఊపిరిలో కార్తీకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి మెయిన్ హీరోయిన్ గా నటించిన బెంగాల్ టైగర్ గురువారం రిలీజ్ కు రెడీ అవుతోంది. -
సూర్యతో కరీనా కపూర్
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఈ ఏడాది కోలీవుడ్ తెరపై మెరవనున్నారు. అది కూడా ఒక ప్రత్యేక నృత్య గీతం ద్వారా. గతంలో కరీనాకి పలు తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించే అవకాశం వచ్చినా, ఆమె అంగీకరించలేదు. చివరకు ప్రత్యేక గీతానికి పచ్చజెండా ఊపడం విశేషం. సూర్య హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అంజాన్’లోనే ఆమె ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే బాలీవుడ్ భామ చిత్రాంగదా సింగ్‌తో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరించారు. ఇందులో ఉన్న మరో ఐటమ్ సాంగ్‌కి కరీనా కపూర్‌ని అడిగారట. హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ పాటకు కాలు కదపడానికి ఆమె అంగీకరించారు. అయితే, ఇంకా డేట్స్ కేటాయించలేదు. కరీనా పని ఒత్తిడి దృష్ట్యా ఆమెకు ఇబ్బంది కలగకుండా ముంబయ్‌లోనే ఈ పాటను చిత్రీరించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా పాటలు స్వరపరిచారు. సూర్య, కరీనాలపై చిత్రీకరించనున్న పాటకు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఇది మంచి మాస్ మసాలా పాట అని సమాచారం. మాస్, క్లాస్ స్టెప్స్‌ని అద్భుతంగా చేయగల కరీనా ఈ పాటలో విజృంభిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.