స్పెషల్ సాంగ్ లో తమన్నా
2011లో రిలీజ్ అయిన ఊసరవెల్లి సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్, తమన్నాలు మరోసారి తెరను పంచుకుంటున్నారు. అయితే ఈ సారి ఫుల్ సినిమాలో ఈ జోడి జంటగా నటించటం లేదట. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమాలో.. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇప్పటికే అల్లుడు శీను సినిమా కోసం ఐటమ్ నెంబర్ చేసిన తమన్నా ఎన్టీఆర్ కోసం మరోసారి అదే పని చేస్తోంది.
కెరీర్ కష్టాల్లో పడిందనుకున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా అవుతోంది. బాహుబలి 2 సినిమాలో బిజీగా ఉన్న తమన్నా, నాగార్జున్, కార్తీ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఊపిరిలో కార్తీకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి మెయిన్ హీరోయిన్ గా నటించిన బెంగాల్ టైగర్ గురువారం రిలీజ్ కు రెడీ అవుతోంది.