
సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం జాక్ అండ్ జిల్ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా మంజు గాయాలపాలవ్వటంతో వెంటనే ఆమెను దగ్గరల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
తలకి బలమైన గాయం కావటంతో కుట్లు వేసినట్టుగా తెలుస్తోంది. మంజు పూర్తిగా కోలుకున్న తరువాతే తిరిగి షూటింగ్ హాజరవుతారని చిత్రయూనిట్ వెల్లడించారు. థిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న జాక్ అండ్ జిల్ సినిమాలో కాళిదాస్ జయరామ్ హీరోగా నటిస్తున్నాడు.