
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన మెడికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)’. అవంతిక ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విడుదల చేశారు. (బుట్టబొమ్మ ఇష్టపడే క్రికెటర్ ఎవరో తెలుసా!)
55 సెకన్ల నిడివి గల ఈ టీజర్ అద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. సంతోషంగా ఉన్న కుటుంబంలో పాప కనపడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పాపను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎలా మిస్ అయింది అనే విషయాలపై టీజర్ ద్వారా సస్పెన్స్‌ని కలిగించారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే సినీ ప్రేక్షకులు ఈ టీజర్‌ను తెగ లైక్ చేస్తున్నారు. దీంతో ఈ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతాన్ని అందిస్తున్నారు. (కాంబినేషన్ ఫిక్స్?)
Comments
Please login to add a commentAdd a comment