'మహేష్ బాబు స్టార్ పవర్ అపారం' | Mahesh Babus star power is enormous: Santosh Sivan | Sakshi
Sakshi News home page

'మహేష్ బాబు స్టార్ పవర్ అపారం'

Published Wed, Sep 21 2016 3:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

'మహేష్ బాబు స్టార్ పవర్ అపారం'

'మహేష్ బాబు స్టార్ పవర్ అపారం'

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబుపై ఆ చిత్ర సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయన స్టార్ పవర్ అపారం అని ఆయనతో కలిసి పనిచేయటం ఆనందంగా ఉందని తెలిపాడు. గత మూడు వారాలుగా చెన్నైలోని ఇవిపి వరల్డ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా మహేష్ ఆఫీస్ కు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

మహేష్ తో తొలిసారిగా వర్క్ చేస్తున్న సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్, సూపర్ స్టార్ ఎనర్జీ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు. మహేష్ ఇక్కడ షూటింగ్ చేయటం చెన్నై కే కొత్త ఎనర్జీ తీసుకొచ్చింది. ఇంత భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కమర్షియల్ గా కూడా సరికొత్త రికార్డ్ లు సృష్టించనుందన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement