O2 Movie Cinematographer Thamizh A Azhagan Interesting Comments On Nayanthara - Sakshi
Sakshi News home page

Nayanthara-O2 Movie: నయన తార ప్రశంస అమితానందాన్ని ఇచ్చింది

Published Thu, Jun 23 2022 8:32 AM | Last Updated on Thu, Jun 23 2022 10:07 AM

O2 Movie Cameraman Interesting Comments On Nayanthara - Sakshi

సాక్షి, చెన్నై: తన ఛాయాగ్రహణం పనితనానికి నయనతార సంతృప్తి చెంది ప్రశంసించడం అమితానందం కలిగించిందని ఓ2 మూవీ సినిమాటోగ్రాఫర్‌ తమిళళగన్‌ అన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన మన్మథలీలై చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ2 చిత్రానికి పనిచేశారు. జీఎస్‌ విఘ్నే ష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డ్రీమ్‌ వారియర్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు నిర్మించిన చిత్రం ఇది. గత 17వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ చిత్రంలో ఛాలెంజ్‌తో కూడిన సన్నివేశాలను సమర్థవంతంగా చిత్రీకరించినట్లు పరిశ్రమ వర్గాలు, మీడియా వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని తమిళళగన్‌ వెల్లడించారు. దర్శకుడు విఘ్నే ష్‌ తన మిత్రుడిని 2019లో ఈ చిత్ర కథను చెప్ప గా అప్పటి నుంచే తానీ కథతో ట్రావెల్‌ అవుతూ వచ్చానని తెలిపారు. ఛాయాగ్రహణం విషయంలో చాలా పేపర్‌ వర్క్‌ చేశానన్నారు. షూటింగ్‌కు ముందు తాను కెమెరామెన్‌ అనగానే నయనతార సంశయించారనీ, తన పేపర్‌ వర్కు గురించి వివరించగానే సంతృప్తి చెందారన్నారు. చిత్రం చూసిన తరువాత చాలా హ్యాపీ అయ్యారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement