అభిమాని కూతురి పెళ్లికి చిరంజీవి ఆర్థిక సాయం | Chiranjeevi Financially Helps His Fan Daughter Marraige | Sakshi
Sakshi News home page

Chiranjeevi : చిరు మంచి మనసు.. అభిమాని కూతురి పెళ్లికి సాయం

Published Tue, Feb 1 2022 8:45 PM | Last Updated on Tue, Feb 8 2022 5:34 PM

Chiranjeevi Financially Helps His Fan Daughter Marraige - Sakshi

Chiranjeevi Financially Helps His Fan Daughter Marraige: మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అభిమానులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరు తాజాగా కష్టాల్లో ఉన్న తన అభిమానికి చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే.. రాజం కొండలరావు అనే వీరాభిమాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవలె ఆయన కూతురు నీలవేణి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు ఈ విషయాన్ని చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement