
పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు ఇదే మంచి తరుణమంటూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ జామన్ టి జాన్ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇంజనీర్, నిర్మాత అన్షు ఎల్సా వర్గీస్‌ను పెళ్లాడాడు. కేరళలోని కుమరకోమ్ బీచ్‌లో వీరి పెళ్లి జరగ్గా వధూవరులిద్దరూ తెలుపు వస్త్రాల్లో ధగధగ మెరిసిపోయారు.
జామన్‌కిది రెండో పెళ్లి
ఈ పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు అతి దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, తెలుగు హీరోయిన్ కృతీ శెట్టి సహా పలువురు తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా జామన్‌కు ఇది రెండో పెళ్లి. ఇతడు 2014 ఫిబ్రవరి 2న నటి అన్ అగస్టీన్‌ను పెళ్లాడాడు. 2020లో వీరు విడాకులు తీసుకున్నారు.
కోలీవుడ్, మాలీవుడ్‌లో బాగా బిజీ
జామన్ టి జాన్.. 2011లో వచ్చిన చప్ప కురిష్ సినిమాతో ఛాయాగ్రహకుడిగా మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. చార్లీ, కెన్ని నింటే మొయిటీన్, తిర, కప్ప, ధ్రువనక్షత్రం.. తదితర తమిళ, మలయాళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. బాలీవుడ్‌లో గోల్‌మాల్ అగైన్, సింబా, సర్కస్, సూర్యవంశీ సినిమాలకు సైతం పని చేశాడు. తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో ఒక పాటకు కెమెరామన్‌గా వ్యవహరించాడు. అలాగే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రానికి అదనపు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.
చదవండి: వీడు హీరో ఏంట్రా? అన్నారు.. రాసిపెట్టుకోండి.. రోషన్ ఎమోషనల్ స్పీచ్
Comments
Please login to add a commentAdd a comment