హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పుట్టెడు దుఃఖంలో ఉంది. పెంపుడు శునకం చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడలేకపోతోంది. పెట్ డాగ్‌తో ఆడుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. 'థియో.. ఈ వారమే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. తన మరణవార్త నా గుండెను ముక్కలు చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నా దానికి ఎంతో ఎనర్జీ ఉండేది.
తన ఇంట్లోనే మేమున్నాం..
మేము దాన్ని ఇంటి యజమాని అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఇది తనిల్లు.. తన ఇంట్లోనే మేము నివసిస్తున్నాం. అదొక సిల్లీ వాచ్‌డాగ్ కూడా! స్టూడియో బయట కూర్చోవడం దానికెంతో ఇష్టం. ప్రతి వేసవిలో దానికి హెయిర్ కట్ చేసేవాళ్లం. దానితో చివరిసారి ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ప్రేమగా ముద్దుపెట్టుకోవాల్సింది. దానిపై ప్రేమ కురిపించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
ఎంతో ప్రేమించా..
అలాగే అది లేదన్న నిజం తట్టుకోలేక డీలా పడిపోయిన నన్ను ఓదార్చి ధైర్యంచెప్పినవారికి కూడా థాంక్స్. థియో.. గత కొన్నేళ్లుగా నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ నువ్వు చాలా మంచి అబ్బాయివి. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించానో అర్థం చేసుకో.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు థియోతో కలిసున్న ఫోటోలు జత చేసింది.
కాగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment