![upendra gadi adda title song shooting at film city - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/14/upendra.jpg.webp?itok=AOngT3Fn)
కంచర్ల ఉపేంద్ర
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఎస్‌కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పోకిరీ జులాయిలు...’ అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు.
కంచర్ల ఉపేంద్ర, వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా ఈ మాస్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఊటీలో చిత్రీకరించే మరో పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘హీరో కావాలన్న మా అబ్బాయి ఆసక్తిని గమనించి, ఐదు చిత్రాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి.
Comments
Please login to add a commentAdd a comment