
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు తనలో దాగిఉన్న మరో టాలెంట్‌ని అందరికి తెలియజేయాలనుకుంటుంది. సినిమాటోగ్రఫీపై అనుపమకు మంచి అవగాహన ఉంది. ఎప్పటికైనా డీఓపీగా పని చేయాలని అనుపమ కోరిక. తాజాగా ఆమె కోరిక నెరవేరింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో సినిమాటోగ్రాఫర్‌గా మారింది.
ఓ యూట్యూబ్ చానల్ వేదికగా విడుదలైన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుస హిట్స్ కూడా ఉన్న ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్‌ఫ్లై తదితర చిత్రాలతో అలరించిన అనుపమ.. ప్రస్తుతం ఓ కోలివుడ్ మూవీతో పాటు మలయాళ ఫిల్మ్‌లోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment