jasmine flowers
-
మల్లెపూలతో మనోహరంగా హీరోయిన్ హన్సిక (ఫొటోలు)
-
బంగారం లాంటి అవకాశం
నేత్ర గురురాజ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. బెంగళూరుకు చెందిన ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా... ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ‘చాప్టర్ 1, ఆల్ఫా 27, అస్ట్రాలజర్స్ లక్కీ డే, జాస్మిన్ ఫ్లవర్స్’ వంటి నాలుగు షార్ట్ ఫిలింస్‌కి పని చేశారు నేత్ర. ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి కథ అందించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగా చేశారు. ‘చాప్టర్ 1’లో విద్యార్థినిగా నటించారు. ‘ఆల్ఫా 27’కి కెమెరా, ఎలక్ట్రికల్ డి΄ార్ట్మెంట్లో పని చేశారు. ‘అస్ట్రాలజర్స్ లక్కీ డే’కి దర్శకత్వం వహించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరూపించుకుంటున్న నేత్ర గురురాజ్ తాజాగా ఆస్కార్ అకాడమీ తరఫున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కడం చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాల్లో సినిమా రంగానికి చెందిన ప్రతిభ గల యువ ఛాయాగ్రాహకులను ఎంపిక చేసి, రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కొన్ని నెలల క్రితం సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేయడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లిన నేత్ర ‘జాస్మిన్ ఫ్లవర్స్’తో తన కెమెరా పనితనాన్ని చాటుకున్నారు. అదే ఆమెకు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కేలా చేసింది. బంగారంలాంటి ఈ అవకాశం దక్కించుకున్న నేత్రకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
మల్లె సాగులో మెళకువలు... ఎకరానికి 4 లక్షల లాభం
-
మల్లెపూల సాగుతో నెలకు 70 వేలు సంపాదిస్తున్న రైతు
-
మల్లెపూలు.. ప్రయోజనాలు బోలెడు!
మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్నిస్తాయని అందరికీ తెలిసిందే, అయితే ఈ పూలను ఔషధాలుగా కూడా వాడుకోవచ్చునని కొందరికే తెలుసు. ఔషధాలుగా ఎలా వాడచ్చో చూద్దాం. ► తాజా మల్లెలను మెత్తగా నూరి.. తడిబట్ట పై చుట్టి, కళ్లమీద పెట్టుకుంటే.. కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరిపోవడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు కలగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ► మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని.. ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. ► తలనొప్పి... తలంతా పట్టేసినట్లు అనిపించడం వంటి సమస్యలకు మల్లెపూలతో తలకు వాసెనకట్టు కడితే.. మంచి ఉపశమనంగా ఉంటుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా.. తలనొప్పిని తగ్గిస్తుంది. ► కళ్లమంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెల కషాయాన్ని వాడవచ్చు. పూలు, ఆకులతో కషాయం కాచాలి. ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చి.. రెండువంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, ఒకవంతు కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ► మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతి కోపం, మానసిక చంచలత్వం.. వీటన్నిటినీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలి. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. మనసు స్థిమితంగా మారుతుంది, ► మధుమేహులకు మల్లెపూలతో చేసిన ఛాయ్ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే గుణం మల్లెలకు ఉంది. ► కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒకరోజంతా నానబెట్టాలి. ఆ తరువాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దన చేసుకుంటే.. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి... -
మల్లెపూలలో మద్యం బాటిళ్లు
-
మల్లెపూలలో మద్యం బాటిళ్లు
సాక్షి, ఉరవకొండ: కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయడానికి సివిల్, ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేసి పట్టుకుంటున్నా అక్రమార్కులు తమ దందా వీడటం లేదు. శనివారం రాత్రి విడపనకల్లు ఎస్ఐ గోపీ ఆధ్వర్యంలో విడపనకల్లు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్ డిజైర్ కారులో మల్లెపూల బస్తాలు తరలిస్తున్నారు. పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా తాము మల్లెపూల వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులూ తెలిపారు. పోలీసులకు వారి మాటలపై అనుమానం రావడంతో మల్లెపూల బస్తాలు లోపల చూడగా అందులో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం బయటపడ్డాయి. హైవార్డ్స్ బాటిళ్లు 87, వీస్కీ టెట్రా ప్యాకెట్లు 88, 8 పీఎం బాటిళ్లు స్వాధీనం చేసున్నారు. ఎస్ఐ గోపీ కేసు నమోదు చేసి కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఉరవకొండ సెబ్ ఆధ్వర్యంలో దాడులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సూపరిండెంట్ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్ సీఐ శ్యాంప్రసాద్, విడపనకల్లు ఇన్స్పెక్టర్ భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమం మద్యం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, నాగేంద్ర ద్విచక్రవాహనంలో 40 విస్కీ బాటిళ్లు, 96 హైవార్డ్స్ విస్కీ బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మద్యం బాటిళ్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన అశోక్, మంజునాథ్‌ల నుంచి 192 హైవార్డ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు మండలం హావళిగి గ్రామ శివార్లలో పాల్తూరు గ్రామానికి చెందిన నాగరాజు వద్ద 96 విస్కీ బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది రియాజ్ అహ్మద్, వెంకటేష్, రమేష్‌బాబు, రామకృష్ణ, వీరారెడ్డి, మౌలాలి, శైలజలు పాల్గొన్నారు. కర్ణాటక మద్యం స్వాధీనం చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలో పోలీసులు విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో 380 కర్ణాటక మద్యం బాటిళ్లు, ఒక ద్విచక్రవాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణస్వామి, నాగేంద్రలు కర్ణాటక రాష్ట్రంలోని తిరుమణి నుంచి మద్యం తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. సెబ్ ఉక్కుపాదం అనంతపురం క్రైం: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఆదివారం జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపారు. 5322 టెట్రా ప్యాకెట్లు, 25 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 19 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేశారు. అలాగే ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న ఇసుకను సీజ్ చేశారు. -
ప్రకృతికాంత పారవశ్యం
హేమంతం వస్తే చాలు ఇంటింటా బంతులు, చేమంతులతో నా పాదాలకు పసుపు పసుపు పూసి, ఎర్రటి కారబ్బంతులతో పారాణి తీర్చి దిద్దుతారు.కుసుమ లావణ్య వతులకు ఈ మాసమంటే ఎంత సరదానో. నా మనసు పరవళ్లు తొక్కుతోంది. నేటి నుంచి నెలనాళ్లు నాకు ప్రతి రోజూ పండుగే. ‘మల్లెలతో వసంతం... చేమంతులతో హేమంతం... వెన్నెల పారిజాతాలు..’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి నన్ను ఎంత అందంగా వర్ణించాడో! హేమంతం వస్తే చాలు ఇంటింటా బంతులు, చేమంతులతో నా పాదాలకు పసుపు పసుపు పూసి, ఎర్రటి కారబ్బంతులతో పారాణి తీర్చి దిద్దుతారు. తెలతెలవారుతుండగా ఇంకా తెలి మేను ముసుగు తొలగించకుండానే నా చిట్టితల్లులు పరికిణీని నడుములోకి దోపి, ముంగిళ్లకు కళ్లాపి స్నానం చేయించి, తెల్లటి ముగ్గుల రంగవల్లులతో వస్త్రధారణ చేసి, ప్రతి గుమ్మాన్ని అందమైన ముద్దుగుమ్మగా తీర్చిదిద్దుతారు. నాకు ఇంటింటా చీర సారె పెట్టినట్లే కదా. నేను ధరించే చీర మీద ఎన్ని అందాలో! ఒకరు పారిజాతాలు, ఒకరు నక్షత్రాలు, ఒకరు మారేడు దళాలు, మరొకరు జాజి తీగెలు, ఒకరు సన్నాయి మేళాలు, మరొకరు పొంగలి కుండలు, చెరకు గడలు, దీపాలు.. ఒక్కొక్కరు ఒక్కో అందమైన రంగవల్లితో చీర తయారుచేసి, నన్ను అలంకరిస్తుంటే, వారి కంటె ఎక్కువగా నేను ఆనందిస్తుంటాను. వాకిట గొబ్బిళ్లు మాత్రం! కుసుమ లావణ్యవతులకు ఈ మాసమంటే ఎంత సరదానో. వారికేంటి సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ మాసాలలో మార్గశిర మాసం తానే అన్నాడు. నా జన్మ ధన్యమైనట్లే కదా. పిల్లలంతా గోమయాన్ని ఇచ్చే ఇళ్లకు తెల్లవారుజామునే వెళ్లి, వరుసలో నిలబడి, కావలసినంత పేడ తెచ్చుకుని, గొబ్బిళ్లుగా తీర్చిదిద్ది, పసుపు, కుంకుమలతో వాటిని అలంకరించి, తెల్లని కాంతులు జత చేసి, ఆ పైన గొబ్బిపూలతోను, రకర కాల రంగురంగుల పూలతో అలంకరిస్తుంటే.. నన్ను అలంకరించినట్లే భావిస్తాను. ఇక నా శ్రీకృష్ణుడికి ఈ మాసమంతా రుచికరమైన ప్రసాదాల ఆరగింపులే. అసలే వెన్న దొంగ, ఈ కమ్మటి వాసనలకు ఆ బాలగోపాలుడు ఎక్కడికీ పోలేడు. హరిదాసులు.. హరి విల్లులు హరిదాసులు విష్ణువుకి దాసులైపోతారు. ఒక చేతిలో చిటి వీణ, ఒక చేతిలో తాళాలు, తల మీద భిక్ష పాత్ర, నుదుటన విష్ణు తిరునామాలు పెట్టుకుని ‘హరీ! హరిలో రంగ హరీ! వైకుంఠధామా హరీ’ అంటూ పాదాలను అల్లుకున్న చిరు మువ్వలు సవ్వడి చేస్తూ, చేతిలోని చిటివీణెను, తాళాలను లయబద్ధంగా మేళవిస్తుంటే, శ్రీకృష్ణదేవరాయల మాలదాసరి నా మనసుకు స్ఫురిస్తాడు. హరికథలు చెప్పే ఆదిభట్ల నారాయణదాసు కూడా కళ్ల ముందు గజ్జెలు ఘల్లుమనేలా గాలిలోకి ఎగురుతున్నట్లు కనిపిస్తాడు. నా హృదయం ఇందుకు సంబరంగా సన్నగా సవ్వడులు చేస్తుంది. గంగిరెద్దుల వారు ఇంటింటికీ వచ్చి ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు’ అని అందరికీ సలాములు చేయిస్తుంటారు. గంగిరెద్దుల వీపులు ఇంద్రధనుస్సులా రంగురంగుల చీరెసారెలతో నిండిపోతాయి. ఎంత వింతో కదా.. గంగిరెద్దు చీరలను ధరించడం! పాడి సంపద సమృద్ధిగా ఉంటేనే కదా నా సంతానమంతా కడుపునిండుగా భోజనం చేయగలుగుతారు. పంట చేతికి వచ్చి, సంపదలతో తులతూగుతూ, నన్ను ఆరాధిస్తూంటే తృప్తిగా ఉంటుంది నాకు. ఇలలో వేల్పుల కొలువు ఇవన్నీ చెప్పి, బొమ్మల కొలువు గురించి మాట్లాడకపోతే ఎలా! ధనుర్మాసానికి వీడ్కోలు పలుకుతూ భోగి నాడు భోగిమంటలు వేసుకుని, సాయంత్రం భోగిపళ్లు పోసుకుంటూ ఎంత భోగం అనుభవిస్తారో చిన్నారులు. వాటితో పాటు ఆడపిల్లలంతా వారిలోని ఆలోచనాశక్తికి పదునుపెట్టి, బొమ్మలకొలువులు ఏర్పాటుచేసి, ఇరుగుపొరుగులను పేరంటాలకు పిలుచుకుని, ఒకరికి ఒకరు అండగా ఉన్నామన్న భరోసా ఇస్తుంటే, ఒక తల్లిగా నాకు ఆనందమే కదా! ఆఖరి రోజున ఈ మాసాన్ని రథమెక్కించి సాగనంపుతుంటుంటే, ఆ భోగం చూడటానికి ఎన్ని కన్నులున్నా చాలవు కదా అనిపిస్తుంది. నన్ను మకరరాశిలోకి పంపేసి, ప్రజలంతా నెల్లాళ్ల పండుగకు ముగింపు పలుకుతుంటే, ఈ నెల్లాళ్ల అనుభూతులను ఏడాదిపాటు నెమరువేసుకుంటూ, మళ్లీ వచ్చే మార్గశిరం కోసం నిరీక్షించాల్సిందే. ఇదిగో మీకందరికీ ఈ ధనుర్మాసానికి స్వాగతం పలుకుతున్నాను. మీరెలాగూ నన్ను గౌరవంగా ఆహ్వానించి, సత్కరించడం ప్రారంభించారుగా. విజయోస్తు! – వైజయంతి పురాణపండ -
ఇది మల్లెల మాసమనీ..
సాక్షి సిటీబ్యూరో: మల్లెలను ఇష్టపడని వారంటూ ఉండరు...మల్లె పరిమళాలు ప్రతి ఒక్కరి మనస్సు ను దోచుకుంటాయి. అల్లుకున్న మల్లె పందిరి నీడకు అందాల జాబిలి తోడైతే అద్భుత అనుభూతి కలుగుతుంది. అందుకే ఎందరో కవులు మల్లెలపై మరుపురాని గీతాలు రాశారు, కొందరైతే సినిమాలే తీసారంటే మల్లెలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ప్రతి రకం పూలల్లో ఏదోకరమైన వాసన ఉంటుంది. అయితే మల్లెపూల వాసనే వేరు. మల్లె మొగ్గలు వికసించిన కొద్దీ వాసన వెదజల్లుతునే ఉంటుంది. అన్నిపూలకంటే మల్లెల వాసన ఎక్కువ దూరం వరకు వస్తుంది. ప్రకృతి నియమం ప్రకారం ఈ పువ్వు ఎండకాలంలో వస్తుంది... సీజన్ ఆగస్టు వరకు... నగరంలోని గుడిమల్కాపూర్ ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌తో పాటు మొజంజాహీ పాత పూల మార్కెట్‌కు మల్లెలు పెద్ద ఎత్తున వివిధ ప్రదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వివిధ రాష్ట్రాలతో పాటు నగర శివారు ప్రాంతాల నుంచి రోజూ దాదాపు 5865 కేజీల మల్లె మొగ్గలు చేరుతున్నాయి. మార్చి నుంచి ప్రారంభమైన సీజన్ ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఈ ఆరు మాసాలు నగరమంతా మల్లెల మయంగా ఉంటుంది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 1490 కేజీలు మల్లె మొగ్గలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో ప్రధానంగా మూడు రకాల మల్లెలు అందుబాటులో ఉన్నాయి. నాటు మల్లె, కాగడ మల్లె, గుండు మల్లె కాగడ మల్లె కాస్త పొడువుగా ఉంటుంది. జిల్లాల నుంచి రాక... ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ లోని షాబాద్, మొయినాబాద్, శంషాబాద్‌తో పాటు వికారబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి నుంచి నగర మార్కెట్‌కు మల్లెలు దిగుమతి అవుతాయి. ప్రధానంగా విజయవాడ, కర్నూల్, మైలవరం, కడప ప్రాంతాల నుంచి నిత్యం రోజూ 15 నుంచి 20 వాహనాల్లో మల్లె మొగ్గలు గడిమల్కాపూర్ మార్కెట్‌కు వస్తున్నాయి. ఇక్కడ దాదాపు 50–60 షాపుల్లో ప్రత్యేకంగా మల్లె మొగ్గలు విక్రయిస్తుంటారు. రోజు 5865 కేజీల దిగుమతులు... గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు దాదాపు రోజూ 5865 కిలోల మల్లె మొగ్గలు వస్తాయి. మొజంజాహీ పాత పూల మార్కెట్ కావడంతో అక్కడ కూడా వెయ్యి కిలలో వరకు మల్లె మొగ్గలు దిగుమతి అవుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మల్లె మొగ్గల ధర కిలో రూ. 150 నుంచి రూ. 180వరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో కిలో ధర రూ.120– రూ.150 వరకు ఉందిమల్లెపూల సీజన్ ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సీజన్లో కడప, మైలవరం విజయవాడ నుంచే కాకుండా నగర చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తీసుకొస్తున్నారు. మార్కెట్‌కు ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో నుంచే నగర శివారు ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తున్నాయి. మార్కెట్లో మల్లె మొగ్గలను కూలింగ్ బాక్స్‌లో ఉంచడానికి సౌకర్యాలు ఉన్నాయి. మల్లెలతో పాటు ఇతర పూలను మార్కెట్‌కు తీసుకొచ్చే రైతులను గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు అదే రోజు డబ్బులు అందేలా చూస్తున్నాం. కమిషన్ ఏజెంట్టు ఎమైన ఆక్రమాలకు పాలుపడితేఫిర్యాధు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం.– కే. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శిగుడిమల్కాపూర్ మార్కెట్ -
అమరావతిలో విధ్వంసకాండ
సాక్షి, అమరావతి: రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న ఏపీ ప్రభుత్వం మరో దుశ్చర్యకు దిగింది. చేతికి వచ్చిన పంటలను నాశనం చేసి అన్నదాతల నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో బుధవారం సీఆర్డీఏ అధికారులు దౌర్జన్యాలకు దిగారు. దిగుబడికి వచ్చిన మల్లె తోటలను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నాశనం చేయొద్దని అధికారులను రైతులు వేడుకున్నారు. తమకు కొంత సమయం ఇవాలని అభ్యర్థించినా అధికారులు కనికరించలేదు. చేసేదిలేక అధికారులను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పంట పొలాల జోలికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తమ నుంచి భూములు తీసుకునే సమయంలో మల్లె తోటకు ఐదు లక్షలు నష్టపరిహరం ఇస్తామని చెప్పి, కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. మంత్రులు గ్రామాల్లో పర్యటించి పదేపదే భూసేకరణ చేస్తామని బెదిరిస్తే భయపడి రాజధానికి భూములిచ్చామని వెల్లడించారు. తమ దగ్గర నుంచి భూములు తీసుకుని ఇచ్చిన హమీలు అమలు చేయ్యకుండా ప్రభుత్వం మోసం చేసిందని మల్లె తోట రైతులు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత తమ తోటల జోలికి రావాలని డిమాండ్ చేశారు. -
మల్లె కాదు.. ఉల్లి..
కల్హేర్: ఉల్లి మొక్క కాడకు పూసిన పూలు ఇవి. విరబూసిన మల్లె చెండులా కనిపిస్తున్నాయి. కల్హేర్ మండలం మహదేవుపల్లి శివారులో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారి పక్కన వ్యవసాయ పొలంలో రైతు పెంటబోయిన సాయిలు సాగు చేసిన ఉల్లిగడ్డలను తీయకుండా అలాగే విత్తనాల కోసం వదిలిపెట్టాడు. అది కాస్తా ఈ విధంగా పెరిగి పెద్దదై పూలు పూసింది. ఆ పూలే మల్లె పూలను తలపిస్తున్నాయి. విరబూసిన పూలు రహదారిపై నుంచి వెళ్లే వారిని ఎంతగానో ఆకట్టకుంటున్నాయి.